Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసీస్ బాల్ టాంపరింగ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా ఎలా పట్టుకున్నారంటే!

 Australian cricket team repeat offenders? How SA planned to catch Steve Smith’s team red-handed

హైదరాబాద్: కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ బాల్ టాంపరింగ్ చేస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. మూడో టెస్టులో మూడో రోజైన శనివారం ఆటలో భాగంగా ఆస్ట్రేలియా క్రికెటర్ కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడు.

తన ప్యాంట్ జేబులోంచి పసుపు రంగు పదార్థంతో బంతి ఆకారాన్ని మార్చే ప్రయత్నం చేశాడు. అయితే బాన్‌క్రాప్ట్ టాంపరింగ్ చేస్తాడని బ్రాడ్‌కాస్టర్లు ఎలా కనిపెట్టగలిగారు? బాన్‌క్రాప్ట్‌ బాల్ టాంపరింగ్ చేస్తున్నాడని విషయాన్ని సఫారీ బ్యాట్స్‌మెన్ అందించిన క్లూ వల్లే తాము బయట పెట్టగలిగినట్లు బ్రాడ్‌కాస్టర్లు చెప్పారు.

డేవిడ్ వార్నర్ మైదానంలో ఫీల్డింగ్ చేసే సమయంలో చేతి వేళ్లకు సాధ్యమైనంత వరకు టేప్ వేసుకుని కనిపించేవాడు. దీనిని గమనించిన సఫారీ బ్యాట్స్‌మెన్ తన చేతికి పెట్టుకున్న టేప్ సాయంతో డేవిడ్ వార్నర్ బంతి ఆకారాన్ని మారుస్తున్నట్లు అంపైర్లకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిని అంఫైర్లు తేలిగ్గా తీసుకున్నారు.

కానీ, ఎప్పుడైతే ఈ విషయాన్ని సూపర్‌స్పోర్ట్ నెట్‌వర్క్ ఛానెల్‌కు తెలిసిందే అప్పటి నుంచి వారు బంతిపై నిఘా పెట్టారు. బౌలర్ బాల్ విసిరినప్పటి నుంచీ తిరిగి అతని చేతికి వచ్చే వరకు కెమెరాల సాయంతో క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టారు.

బెన్‌క్రాఫ్ట్‌ బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించడం.. ఆ సన్నివేశాలను టీవీలో చూపించడంతో కోచ్‌ డారెన్‌ లెహమాన్‌ అప్రమత్తమై డగౌట్‌లో ఉన్న ఆటగాళ్లతో వాకీటాకీలో మాట్లాడటం, వారి నుంచి సలహాలు తీసుకున్న బెన్‌క్రాఫ్ట్‌ తన వద్ద ఉన్న టేపును ఫ్యాంటు లోపల వేసుకోవడం ఇవన్నీ జరిగిపోయాయి.

వీటన్నింటినీ సూపర్‌స్పోర్ట్ నెట్‌వర్క్ ఛానెల్‌ కెమెరామెన్ జోటని ఆస్కార్‌ తన కెమెరాతో బంధించేశాడు. ఈ ఆస్కార్ ఎవరో కాదు.. భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టు జరిగే సమయంలో ఇతడి గురించి విన్నాం. మిగతా కెమెరామెన్లకు విభిన్నంగా సూటు, బూటు వేసుకువచ్చి మ్యాచ్‌ను చిత్రీకరిస్తూ అప్పుడు భారత అభిమానుల మనసును గెలుచుకున్నాడు.

తాను ధరించే సూటును ఇండియాలోనే కుట్టించుకున్నట్లు కూడా అప్పుడు ఆస్కార్‌ చెప్పాడు. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ల బాల్‌ టాంపరింగ్‌ ఉదంతాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన ఆస్కార్‌పై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఆస్కార్‌ ఫొటోను తన ట్విటర్‌ ద్వారా పంచుకుని 'ఆస్కార్‌ - ద కెమెరామెన్‌. ఇతని కెమెరా నుంచి తప్పించుకోవడం కష్టమే కాదు అసాధ్యం కూడా' అని ట్వీట్‌ చేశాడు.

ఇక, ఆసీస్ బౌలర్లు 30 ఓవర్లలోపే బంతిని రివర్స్ స్వింగ్ చేయడాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని దక్షిణాఫ్రికా మాజీ పేస్ బౌలర్ ఫానీ డివిలియర్స్ ఆర్ఎన్ఎస్ రేడియాకు ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించాడు. అయితే దీని వెనుక కచ్చితంగా ఏదో మతలబు ఉందని అప్పుడే అనుమానం వచ్చిందని తెలిపారు.

దీంతో ఈ విషయాన్ని సూపర్‌స్పోర్ట్ నెట్‌వర్క్ కెమెరామెన్‌కు చెప్పడంతో వాళ్లు గంటన్నరపాటు బంతి ఎవరెవరి చేతుల్లోకి వెళ్తున్నదో జాగ్రత్తగా గమనించి బాల్ టాంపరింగ్ అవుతున్న విషయాన్ని కనిపెట్టారని తెలిపాడు. దీంతో బాన్‌క్రాఫ్ట్ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడని డివిలియర్స్ వెల్లడించాడు.

దక్షిణాఫ్రికాలో పచ్చిక ఉన్న పిచ్‌లపై బంతి ఆకారం అంత త్వరగా మారిపోవడం అసాధ్యమని, కానీ 30 ఓవర్లలోపే ఆసీస్ బౌలర్లు రివర్స్ స్వింగ్ చేయడంతో వాళ్లు కచ్చితంగా ఏదో చేస్తున్నారన్న అనుమానం కలిగిందని తెలిపాడు. ఎవరైనా బంతిని ఓ ఐరన్ లేదా స్టీల్ పరికరంతో ఆకారం మార్చినపుడు అది వెంటనే రివర్స్ స్వింగ్ అవుతుందని డివిలియర్స్ తెలిపాడు.

ఆస్ట్రేలియన్లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్లు వీడియో బయటకు రాడంతో గతంలోనూ ఆ జట్టూ ఇలాగే ఎన్నోసార్లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన యాషెస్‌ సిరీస్‌‌లో కూడా బాన్‌క్రాప్ట్ టాంపరింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది.

Story first published: Monday, March 26, 2018, 18:15 [IST]
Other articles published on Mar 26, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+