Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యాషెస్ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు షాక్..కెప్టెన్సీ నుంచి తప్పుకున్న టిమ్ పెయిన్..ఏం జరిగింది..?

Australian captain Tim Paine bids goodbye to captaincy ahead of Ashes series.

యాషెస్ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌ బాధ్యతల నుంచి టిమ్ పెయిన్ తప్పుకున్నాడు. తాను ఓ మహిళా సిబ్బందికి అసభ్యకరమైన మెసేజ్‌లు చేయడంపై క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ చేసింది. ఈ సమయంలోనే తాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు టిమ్ పెయిన్.

యాషెస్ సిరీస్‌ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. డిసెంబర్ 8 నుంచి యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టుకు బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియం వేదిక కానుంది. ఇక తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు పెయిన్ చెప్పాడని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటనలో పేర్కొంది. అది కూడా వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇక కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పగానే టిమ్ పెయిన్ రాజీనామాను క్రికెట్ ఆస్ట్రేలియా ఆమోదించింది. ఇక కొత్త టెస్టు కెప్టెన్‌ కోసం అన్వేషణ ప్రారంభిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.

వ్యక్తిగతంగానే కాకుండా తన కుటుంబంను కూడా దృష్టిలో ఉంచుకుని తాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు టిమ్ పేర్కొన్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా ఛైర్మెన్ రిచర్డ్ చెప్పారు. ఇదిలా ఉంటే టిమ్ ఓ మహిళా సిబ్బందిని మెసేజ్‌లతో వేధించాడన్న ఆరోపణలపై విచారణ చేపట్టిన క్రికెట్ ఆస్ట్రేలియా టిమ్ ఎలాంటి తప్పు చేయలేదని నిర్ధారించింది. ఎక్కడ నియమనిబంధనలను ఉల్లంఘించలేదని అది తమ విచారణలో తెలిసిందని నివేదిక ఇచ్చింది. నిబంధనలను ఉల్లఘించి ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై చర్యలు తప్పకుండా తీసుకుంటామని వెల్లడించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఇక టిమ్ తాను కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మెరుగ్గా రాణించాడంటూ క్రికెట్ బోర్డు కితాబిచ్చింది. ఇక టెస్టు జట్టు ఎంపిక చేసే సమయంలో మిగతా ఆటగాళ్లలానే టిమ్ కూడా అందుబాటులో ఉంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది.

ఇక తొలి టీట్వంటీ ప్రపంచ కప్ గెలిచి మంచి ఊపుమీద కనిపిస్తోంది ఆస్ట్రేలియా జట్టు. ఇక అన్ని టోర్నమెంట్లకంటే యాషెస్ సిరీస్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ఆస్ట్రేలియా. ఇంగ్లాండ్ కూడా చాలా పటిష్టంగా కనిపిస్తోంది. యాషెస్ టైటిల్‌ను గెలవాలనే కసితో ఉంది ఇంగ్లాండ్ జట్టు. అయితే డిసెంబర్ 8న తొలి యాషెస్ టెస్టు జరగనుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు తీవ్ర కసరత్తు చేస్తోంది.

Story first published: Friday, November 19, 2021, 12:25 [IST]
Other articles published on Nov 19, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+