T20 World Cup 2022: నాలుగు ఓవర్లలోనే మ్యాచ్‍ను సెట్ చేశారు.. ఓటమిపై ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సిడ్నీలో జరిగిన సూపర్-12లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ 89 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఓటమిపై కెప్టెన్ ఆరోన్ ఫించ్ మాట్లాడారు. "న్యూజిలాండ్ ఓపెనర్ల బాగా ఆడారని చెప్పాడు. వారు మొదటి నాలుగు ఓవర్లలోనే మ్యాచ్ ను సెటె చేశారు. లక్ష్య ఛేదనలో మాకు పెద్ద ప్రారంభం కావాల్స ఉండే.. కానీ అది జరగలేదు. చాలా త్వరగా వికెట్లు కోల్పోయం. మాకు ఇంకా నాలుగు మ్యాచ్ లు ఉన్నాయి. వాటన్నింటీలో గెలవాలి. మాకు అదృష్టం కూడా కలిసి రావాలి" అని ఫించ్ అన్నాడు.

కాన్వే
కాగా ఈ మ్యాచ్ లో మొదట బ్యాంటింగ్ చేసిన న్యూజిలాండి 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఓపెనర్లు ఫిన్ అలేన్, కాన్వే విధ్వంసం సృష్టించారు. కాన్వే 58 బంతుల్లో 2 సిక్స్ లు, 7 ఫోర్లతో 92 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మరో ఓపెనర్ ఫిన్ అలేన్ 16 బంతుల్లో 3 సిక్స్ లు, 5 ఫోర్లతో 42 పరుగులు చేశాడు. చివర్లో నిషామ్ 13 బంతుల్లో 26 పరుగులు చేశాడు. హజిల్ వుడ్ 2 వికెట్లు పడగొట్టగా.. జంపా ఒక్క వికెట్ తీశాడు.

111 పరుగులకే
201 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 111 పరుగులకే ఆలౌట్ అయింది. కంగారులు ఏ దశలోనూ గెలుపు వైపు ప్రయాణం చేయలేదు. కివీస్ బౌలర్ల కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. వార్నర్ ను 5 పరుగులకే పెవిలయన్ కు చేర్చారు. గ్లెన్ మ్యాక్స్ వెల్ ఒక్కడే 28 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ప్యాట్ కమ్మిన్సి 21 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ, సాట్నర్ మూడేసి వికెట్లు పడగొట్టగా... బౌల్డ్ 2 వికెట్లు తీశాడు. ఫర్గీసన్, సోధి ఒక్కో వికెట్ పడగొట్టారు.

విలియమ్సన్
గెలుపుపై న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ మాట్లాడారు." ఇది అద్భుతమైన రోజు, ఓపెనర్లు మ్యాచ్ ను సెట్ చేసారు, బ్యాటింగ్ ద్వారా చాలా సహకారం అందించారు. ఈ పిచ్‌పై ఇది చాలా మంచి స్కోరు. ఆ తర్వాత బౌలర్లు బాగా రాణించడంతో పాటు ఫీల్డ్‌లో మంచి మద్దతు లభించింది. ఈ మ్యాచ్ లో అందరూ బాగా ఆడారు" అని విలియమ్సన్ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications