Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసీస్ పేసర్ తలను తాకిన బంతి: విరిగిన ఎముక, ర‌క్తస్రావం

హైదరాబాద్: ఆస్ట్రేలియా పేస్‌ బౌలర్‌ జో మెన్నీ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. బిగ్‌ బాష్‌ లీగ్‌లో భాగంగా నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న స‌మ‌యంలో జో మెన్నీ త‌ల‌ను బంతి బ‌లంగా తాకింది. దీంతో అతని త‌ల‌లో ఎముక విర‌గ‌డంతోపాటు ర‌క్తస్రావం కూడా జ‌రిగింది. మెన్నీ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య గతేడాది నవంబర్‌లో జరిగిన టెస్టు సిరిస్‌లో ఆస్ట్రేలియా తరుపున టెస్టు అరంగేట్రం చేశాడు.

బిగ్‌ బాష్‌ లీగ్ సెమీ ఫైనల్‌లో భాగంగా నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సిడ్నీ సిక్సర్స్‌కు చెందిన మైకేల్‌ లుంబ్‌ విసిరిన బంతి మెన్నీ తలకు బలంగా తాకింది. సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంట‌నే అత‌న్ని బ్రిస్బేన్‌లోని ఓ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి అన్ని ప‌రీక్ష‌లు చేయించారు.

Australian bowler Joe Mennie suffers fractured skull, brain bleed

ఆ త‌ర్వాత అదేరోజు సాయంత్రం అత‌న్ని డిశ్చార్జ్ చేసిన‌ట్లు సీఏ చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ జాన్ ఆర్చ‌ర్డ్ తెలిపారు. అయితే మంగ‌ళ‌వారం క్రికెట్ ఆస్ట్రేలియా డాక్ట‌ర్ కొన్ని స్కాన్లు చేయ‌గా అత‌ని త‌ల‌లో ఎముక విరిగింద‌ని, మెదడులో రక్తస్రావం అయినట్లు వైద్యులు గుర్తించారు. అయితే ఎలాంటి శస్త్రచికిత్స చేయనక్కర్లేదని వైద్యులు తెలిపినట్లు సీఏ ఓ ప్రకటనలో తెలిపింది.

'సోమవారం నెట్స్‌లో సాధన చేస్తుండగా మెన్నీ తలకు బంతి తగిలింది. అతన్ని చికిత్స నిమిత్తం బ్రిస్బేన్‌లోని ఆసుపత్రికి తరలించాం. చికిత్స అనంతరం అదేరోజు సాయంత్ర వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు' అని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ జాన్‌ ఆర్చడ్‌ తెలిపారు.

'ఏదిఏమైనా ఇదో తీవ్రమైన గాయం. ప్రస్తుతం జో మెన్నీ కోలుకుంటున్నాడు. ఈ గాయానికి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం రాకపోవచ్చు' అని వైద్యులు తెలిపారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+