Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుమ్రాతో గొడవ.. నా తప్పే: సామ్ కొన్‌స్టాస్

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాతో గొడవపై ఆస్ట్రేలియా యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ స్పందించాడు. ఈ గొడవలో తనదే తప్పని, అనుకోకుండా జరిగిపోయిందని తెలిపాడు. జస్‌ప్రీత్ బుమ్రా అసాధారణ బౌలర్ అని కొనియాడాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌తో సామ్ కొన్‌స్టాస్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.

అరంగేట్ర మ్యాచ్‌లోనే బుమ్రాపై భారీ సిక్స్‌లతో ఎదురుదాడికి దిగాడు. కొన్‌స్టాస్ ధాటికి బుమ్రా మూడేళ్ల తర్వాత టెస్ట్‌ల్లో సిక్సర్ సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో కొన్‌స్టాస్‌తో కోహ్లీ గొడవకు దిగాడు. అతన్ని భుజంతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో కోహ్లీపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంది. సిడ్నీ టెస్ట్ ఆఖరి టెస్ట్‌లో కొనస్టాస్‌ బుమ్రాతో గొడవకు దిగాడు. సమయాన్ని వృథా చేయాలనే ఉద్దేశంతో బుమ్రాతో వాగ్వాదానికి దిగాడు.

Australian batter breaks silence on heated exchange with Indian star Bumrah in BGT 2024-25

కొన్‌స్టాస్‌పై కోపంతో బుమ్రా ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేశాడు. ఆ తర్వాత కొన్‌స్టాస్‌ వైపు చూస్తూ బుమ్రాతో పాటు భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా ఈ ఘటనపై స్పందించిన కొన్‌స్టాస్.. ఈ గొడవలో తనేద తప్పని అంగీకరించాడు. "దురదృష్టవశాత్తు, ఉస్మాన్ ఖవాజా ఔట్ అయ్యాడు. అతను ఇంకాసేపు ఆడేందుకు ప్రయత్నించాడు. బహుశా ఇది నా తప్పే. అయితే క్రికెట్ అన్నాక ఇలాంటివి జరుగుతాంటాయి." అని చెప్పుకొచ్చాడు.

అలానే వివాదం జరిగిన తర్వాత ఖవాజా వికెట్ ను బుమ్రా తీయడాన్ని ప్రశంసించాడు కొన్‌ స్టాస్‌. "బుమ్రాకే క్రెడిట్ దక్కుతుంది. అతడు వికెట్ సాధించాడు. కానీ జట్టు కూడా గొప్ప ప్రదర్శన చేసింది. ఇకపోతే వాస్తవానికి నేను చాలా కామ్. నా అరంగేట్రం మంచిగా జరిగింది. రెండు విజయాలు సాధించడం పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను." అని పేర్కొన్నాడు.

త్వరలోనే శ్రీలంకలో ఆస్ట్రేలియా రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్ ఆడనుంది. జనవరి 29 నుంచి ఇది ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ కోసం తనను ఎంపిక చేస్తారో లేదో తెలీదని అన్నాడు కొన్‌ స్టాస్‌. " నేను సెలెక్ట్ అవుతానో లేదో పక్కాగా తెలీదు. మరికొన్ని రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ వస్తుంది. కానీ నేను భిన్న పిచ్ లను అడాప్ట్ చేసుకుంటున్నాను. కాలమే సమాధానం చెబుతుంది." అని చెప్పుకొచ్చాడు.

గొడవ ఏంటంటే..?
సిడ్నీ టెస్ట్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్‌ సమయంలో బుమ్రా ఐదో బంతి వేసేందుకు సిద్ధమవ్వగా.. స్ట్రైకింగ్‌ ఎండ్ లో ఉన్న ఉస్మాన్ ఖవాజా పక్కకు జరిగాడు. దీంతో ఏమైంది అంటూ బుమ్రా కాస్త కోపడ్డాడు. అప్పుడు నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న కొన్‌స్టాస్‌ బదులివ్వడంతో వాగ్వాదం జరిగింది.ఇద్దరూ ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లారు. అప్పుడు అంపైర్, ఖవాజా జోక్యం చేసుకుని వారికి సర్ది చెప్పారు. దీంతో వివాదం ముగిసింది. ఆ తర్వాత అదే ఓవర్‌లో చివరి బంతికి ఖవాజా స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటూ కొన్‌స్టాస్‌ వైపు వచ్చారు.

Story first published: Tuesday, January 7, 2025, 19:16 [IST]
Other articles published on Jan 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+