వీడియో వైరల్: ఇలా కూడా హిట్ వికెట్‌గా ఔట్ అవుతారా?
హైదరాబాద్: క్రికెట్‌లో క్రికెట్‌లో హిట్ వికెట్‌గా బ్యాట్స్‌మెన్లు వెనుదిరగడం కొత్తేమీ కాదు. గతంలో చాలా మంది క్రికెటర్లు ఇలా హిట్ వికెట్‌గా వెనుదిరిగిన సందర్భాలు అనేకం. పేరు మోసిన దిగ్గజ ఆటగాళ్లు సైతం దీనికి అతితమేమి కాదు. కానీ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ అయిన హిట్ వికెట్‌ను మాత్రం ఇంతవరకు ఎక్కడా చూసుండరు.
ఎన్పీసీ, విక్టోరియా జట్ల మధ్య ఆదివారం ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ జేక్ వెదర్లాడ్ వినూత్నంగా ఔటయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తన అధికారిక వెబ్‌సైట్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
హిట్ వికెట్ చాలా ఫన్నీగా
జేక్ వెదరాల్డ్ అయిన హిట్ వికెట్ చాలా ఫన్నీగా ఉంది. వెదర్లాడ్ చేతుల్లో నుంచి జారిన బ్యాట్ గాల్లోకి లేచి అమాంతం వికెట్లపై పడింది. దీంతో వెదర్లాడ్ సైతం ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇక్కడ వెదర్లాండ్ బ్యాటింగ్ చేస్తూ ఫ్రంట్ ఫూట్ డ్రైవ్‌కు యత్నించాడు. అయితే అది కాస్తా గురితప్పి, చేతిలోంచి బ్యాట్ గాల్లోకి ఎగిరింది.

బ్యాట్ లెగ్‌స్టంప్‌పై పడి కిందపడ్డ బెయిల్స్
తలమీదుగా ఎగురుతూ బ్యాట్ లెగ్‌స్టంప్‌పై పడి బెయిల్స్ కిందపడ్డాయి. దీంతో అతను ఔట్ అంటూ అంపైర్ ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ట్విటర్‌లో పెట్టగా వైరల్‌గా మారింది. జేక్ వెదర్లాండ్ ఎలా వెనుదిరిగాడో ఒకసారి చూడండి అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.
ఎన్‌ఎస్‌డబ్ల్యూ క్రికెట్ క్లబ్ ఇలాంటిదే మరో ఘటనను
ఈ ట్వీట్‌కు రీప్లై ఇస్తూ ఎన్‌ఎస్‌డబ్ల్యూ క్రికెట్ క్లబ్ ఇలాంటిదే మరో ఘటనను క్రికెట్ అభిమానులతో పంచుకుంది. జేక్ వార్తల్లో నిలవడం ఇదే తొలిసారేం కాదు. ఈ ఏడాది జనవరిలో జరిగిన బిగ్‌బాష్ లీగ్‌లో అద్భుతమైన రీతిలో క్యాచ్ పట్టి అందరి మన్నలను అందుకున్న సంగతి తెలిసిందే.
సీపీఎల్‌లో స్మిత్ సైతం హిట్ వికెట్‌గా
ఇటీవల ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో వినూత్నంగా ఒకే బంతికి రెండు విధాలా పెవిలియన్‌కు చేరిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications