Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జట్టు ఓటమి: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన డేవిడ్ హస్సీ

హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మెన్ డేవిడ్ హస్సీ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా మెల్ బోర్న్ స్టార్స్, పెర్త్ స్కార్చర్స్ మధ్య బుధవారం సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మెల్ బోర్న్ స్టార్స్ ఓటమి పాలైంది. మ్యాచ్ అనంతరం డేవిడ్ హస్సీ తన రిటైర్మెంట్‌ని ప్రకటించాడు.

ఆ సమయంలో కాస్త ఉద్వేగానికి లోనయ్యానని, రిటైర్మెంట్ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్ సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని హస్సీ బుధవారం తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. గత రాత్రి జట్టులోని యువ ఆటగాళ్లతో తని వీడ్కోలు నిర్ణయంపై మాట్లాడనని చెప్పాడు.

బిగ్ బాష్ లీగ్ టోర్నీలో గత రెండు సీజన్లలో మెల్ బోర్నీ స్టార్స్ జట్టుకు డెవిడ్ హస్సీ కెప్టెన్‌గా ఉన్నాడు. మరోవైపు హస్సీ వీడ్కోలు నిర్ణయంపై ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ తన ఇనిస్టాగ్రామ్ ద్వారా అభిమానులు తెలియజేశాడు. అందులో డేవిడ్ హస్సీతో స్పెషల్. అతని ఫైనల్ గేమ్‌లో తనతో పాటు ఆడినందకు సంతోషంగా ఉందని రాసుకొచ్చాడు.

క్రికెట్ కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి మైదానం లోపల బయటా తానొక అద్బుతమని పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు. 2011 నుంచి బిగ్ బాష్ లీగ్‌లో డేవిడ్ హస్సీ మెల్ బోర్న్ స్టార్స్ జట్టు తరుపున ఆడుతున్నాడు. ఆరు సీజన్లలో 48 ఇన్నింగ్స్ లాడిన హస్సీ 26.71 యావరేజితో 855 పరుగులు చేశాడు.

13 ఏళ్లపాటు ఆస్ట్రేలియా జట్టుకు సేవలందించిన హస్సీ ఏప్రిల్ 2015లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియా తరుపున 69 వన్డేలు, 39 టీ20లు ఆడిన హస్సీ అందులో 17 అర్ధసెంచరీలు, ఒక సెంచరీ నమోదు చేశాడు. 2009లో స్కాట్లాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో ఈ ఒక్క సెంచరీని నమోదు చేయడం విశేషం.

87 బంతుల్లో 111 పరుగులతో సెంచరీని నమోదు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రాణించిన హస్సీ ఆస్ట్రేలియా తరుపున ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడకపోవడం విశేషం.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+