హైదరాబాద్: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్, జట్టు సహచర ఆటగాడు క్రిస్ లిన్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. క్రిస్ లిన్ ప్రపంచంలో 'హార్డెస్ట్ హిట్టర్' అని ప్రశంసించాడు. బంతిని బలంగా బాదడంలో అతడిని మించిన వాడు లేడండూ కొనియాడాడు.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
గాయం నుంచి కోలుకున్న వెంటనే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని క్రిస్ లిన్‌ని ఆకాశానికెత్తేశాడు. 'అంతర్జాతీయ క్రికెట్‌లో బంతిని బలంగా కొట్టడంతో క్రిస్ లిన్ అందరికంటే ముందుంటాడు. పునరాగమనం ఇంత ఘనంగా చాటతానని అతడే అనుకుని ఉండకపోవచ్చు. ఎందుకంటే గాయంతో నెల రోజులు ఆటకు దూరమై బరిలోకి దిగిన వెంటనే నాణ్యమైన ఇన్నింగ్స్ ఆడడం మామూలు విషయం కాదు' అని గంభీర్ అన్నాడు.

'చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఊహించని రీతిలో అతడు చెలరేగాడు. సునీల్ నరైన్, క్రిస్ లిన్ ఇద్దరూ రెండువైపుల హిట్టింగ్ చేశారు. ఇలాంటి ఇన్నింగ్స్ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఆరు ఓవర్లలో 105 పరుగులు చేస్తారని ఎవరూ ఊహించరు. నరైన్ ఓపెనర్‌గా పంపడం మంచి ఫలితాన్ని ఇచ్చింది' అని గంభీర్ పేర్కొన్నాడు.
కాగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సునీల్ నరేన్, క్రిస్ లిన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. నరైన్ 17 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 54 పరుగులు చేయగా, క్రిస్ లిన్ 22 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.