Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. మధ్యలో నా భార్య గుర్తొచ్చింది: స్టార్ క్రికెటర్

Australian all-rounder Moises Henriques opens up about depression, says once considered suicide

సిడ్నీ: మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని ఆస్ట్రేలియా క్రికెటర్‌ మోజెస్ హెన్రిక్స్‌ తెలిపాడు. ఓ దశలో ఏం చేయాలో అర్థం కాక జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నానని, వేగంగా కారును డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లి పిల్లర్‌కు ఢీకొట్టి ఆత్మహత్యకు యత్నిద్దామని అనుకున్నట్లు హెన్రిక్స్‌ తెలిపాడు. అయితే ఆత్మహత్య ప్రయత్నంలో తన భార్య క్రిష్టాతో​ పాటు కుటుంబం గుర్తుకు రావడంతో ఆ ఆలోచనను నుంచి బయటకు వచ్చానని హెన్రిక్స్‌ చెప్పుకొచ్చాడు. అయితే ఇదంతా మూడు సంవత్సరాల క్రితం జరిగింది.

డిప్రెషన్‌లోకి వెళ్లా:

డిప్రెషన్‌లోకి వెళ్లా:

'ఆర్డినెరోలి స్పీకింగ్ పోడ్‌కాస్ట్'తో మోజెస్ హెన్రిక్స్‌ తాజాగా మాట్లాడుతూ...'2017లో డిప్రెషన్‌లో ఉన్నా. మానసికంగా(డిప్రెషన్) చాలా సతమతమయ్యా. డిప్రెషన్ ఆందోళన లక్షణాలను గూగుల్‌ శోధించి మరీ అవునా.. కాదా అని తెలుసుకున్నా. నాలో మానసిక ఆందోళన లక్షణాలు ఎక్కువగా ఉన్నాయనిపించింది. ఎక్కువ సేపు పడుకోవాలని ఉండేది. మందులు కోసం తీవ్రంగా ప్రయత్నించా. విశ్రాంతి తీసుకోవడానికి మత్తు మందులు వాడాలనిపించింది' అని తెలిపాడు. మూడు సంవత్సరాల క్రితం ఒక ఫస్ట్-క్లాస్ మ్యాచ్ జరిగే సమయంలో ఈఘటన జరిగింది.

నేరుగా వెళ్లి పోల్‌ గుద్దేయాలనుకున్నా:

నేరుగా వెళ్లి పోల్‌ గుద్దేయాలనుకున్నా:

'అసలు ఆలోచనలు లేకుండా ఉండటం కోసం మందులు వేసుకోవాలనుకునే వాడిని. ఇలా ఒకానొక సమయంలో బ్యాంక్స్‌టౌన్‌ నుంచి ఇంటికి కారులో వస్తుండగా చనిపోవాలని అనిపించింది. 110 కి.మీ వేగంతో వెళ్లి పోల్‌ను ఢీకొట్టాలనుకున్నా. ఏదో ప్రమాదంలా కాకుండా నేరుగా వెళ్లి పోల్‌ గుద్దేయాలనుకున్నా. ఆ తర్వాత ఏం జరుగుతుందో, దాని పర్యవసానం ఎలా ఉంటుందో అని మరో ఆలోచన వచ్చింది. అప్పుడు ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్‌ కాదనిపించింది' అని మోజెస్ హెన్రిక్స్‌ పేర్కొన్నాడు.

 నా భార్య గుర్తొచ్చింది:

నా భార్య గుర్తొచ్చింది:

'నా సోదరులను వదిలి ఎలా వెళ్లి పోగలను. నా భార్య క్రిస్టాను ఒంటిరిని చేసి ఆత్మహత్య చేసుకోవడం సరైనది కాదనిపించింది. నా కోసం ఉన్న ఉన్న వారి కోసం బ్రతకాలనుకున్నా. నన్ను ప్రేమించే వారు ఉన్నారనుకున్నా. దాంతో ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది. ఆ సమయంలో వణుకుతున్నా. తేరుకోవడానికి ఐదు నిమిషాలు పట్టింది. ఇక ఆ ఆలోచన నుంచి బయటపడటానికి రెండు రోజుల పాటు 10 మందితో కూడిన నా జట్టుతోనే ఉన్నా' అని హెన్రిక్స్‌ చెప్పుకొచ్చాడు. హెన్రిక్స్ చివరిసారిగా 2017 అక్టోబర్‌లో అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 33 ఏళ్ల ఈ ఆసీస్ ఆల్‌రౌండర్‌ కేవలం 11 వన్డేలు, 11 టీ20, 4 టెస్టులు ఆడాడు.

Story first published: Saturday, April 25, 2020, 14:54 [IST]
Other articles published on Apr 25, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+