Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియా, జింబాబ్వే మధ్య మ్యాచులో ఫిక్సింగ్ జరిగిందా?

Shane Watson
కరాచీ: ఆస్ట్రేలియా, జింబాబ్వే మధ్య అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసీస్‌ ఓపెనర్లు వాట్సన్‌, హడిన్‌ కావాలనే తొలి 10 ఓవర్లలో నెమ్మదిగా బ్యాటింగ్‌ చేయడం అనుమానాలకు దారి తీసింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) విచారణ మొదలుపెట్టినట్లు సమాచారం. ఆ మ్యాచ్‌లో ఓపెనర్లు తొలి 11 ఓవర్లలో కేవలం 28 పరుగులే చేశారు. 15 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 53 మాత్రమే. ఓపెనర్లు నెమ్మదిగా ఆడడంపై సందేహాలు తలెత్తడంతో ఐసీసీ అవినీతి నిరోధక విభాగం మ్యాచ్‌ను సమీక్షించింది. ఈ ఆరోపణలకు ఏమాత్రం విలువలేదని ఆసీస్‌ జట్టు మేనేజర్‌ స్టీవ్‌ బెర్నార్డ్‌ చెప్పాడు. ఆస్ట్రేలియా కోచ్‌ టిమ్‌ నీల్సన్‌ తమ ఓపెనర్లను సమర్థించాడు.

మరోవైపు శ్రీలంకలోనూ ఫిక్సింగ్‌ ఆరోపణలు ప్రకంపనలు రేపుతున్నాయి. పాకిస్థాన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ మహేల జయవర్దనే, తిలాన్‌ సమరవీరలు ఉద్దేశపూర్వకంగానే ఔటయ్యారని లంక అధికారిక టీవీ ఛానెల్‌ ఆరోపించింది. జయవర్దనే 2 పరుగులకు ఔట్‌ కాగానే ఇండిపెండెంట్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌(ఐటీఎన్‌) ఛానెల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణల్ని శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఖండించింది.

శ్రీలంక ఆటగాళ్లపై ఫిక్సింగ్‌ ఆరోపణ చేయడంపై మాజీ కెప్టెన్‌ రణతుంగ మండిపడ్డాడు. ''ప్రపంచకప్‌లో మెరుగ్గా ఆడే సమయంలో ఇలాంటి ఆరోపణలు చేయడం తగదు. ఇది జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఉద్దేశపూర్వకంగానే ఎవరో జట్టు నైతిక స్త్థెర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోంద''ని విరుచుకుపడ్డాడు. మరోవైపు ఆరోపణలు ప్రసారం చేసిన టీవీ ఛానెల్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన సంప్రదింపులు జరుపుతున్నట్లు జయవర్దనే మేనేజర్‌ తెలిపాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+