ఆసీస్ ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్: మెరిసిన షా, కోహ్లీ.. భారత్ 358 ఆలౌట్


హైదరాబాద్: సిడ్నీ వేదికగా క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో గురువారం ఆరంభమైన నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఓపెనర్ పృథ్వీ షా (66: 69 బంతుల్లో 11 ఫోర్లు), కెప్టెన్ విరాట్ కోహ్లి (64: 87 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్), పుజారా (54: 89 బంతుల్లో 6 ఫోర్లు) రహానే (56 రిటైర్డ్ ఔట్), హనుమ విహారి (53) హాఫ్ సెంచరీలతో మెరిశారు.
దీంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 92 ఓవర్లలో 358 పరుగులకి ఆలౌటైంది. నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లో వర్షం కారణంగా బుధవారం తొలిరోజు ఆట రద్దైన సంగతి తెలిసిందే. గురువారం ఆరంభమైన మ్యాచ్‌లో భారత్ టాపార్డర్ పరుగుల మోత మోగించారు.
టాస్ గెలిచిన క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టు కెప్టెన్ శామ్ వైట్‌మాన్ కోహ్లీసేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇటీవల ఆసీస్‌పై టీ20 సిరీస్‌లో ఘోరంగా విఫలమైన కేఎల్ రాహుల్.. పృథ్వీ షాతో కలిసి భారత్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఐదో ఓవర్‌లోనే రాహుల్ (3) ఔటై నిరాశపరచాడు.
హాఫ్ సెంచరీతో చెలరేగిన పృథ్వీ షా
ఆ తర్వాత పుజారాతో కలిసి ఇన్నింగ్స్ కొనసాగించిన పృథ్వీ షా వరుస బౌండరీలతో చెలరేగాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన పృథ్వీ షా జట్టు స్కోరు 96 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ, హనుమ విహారి, రోహిత్ శర్మ (40) దూకుడుగా ఆడి స్కోరు బోర్డుని పరిగెత్తించారు.
భారత్ 358కే పరుగులకే ఆలౌట్
మరోవైపు టెస్టుల్లో వైస్ కెప్టెన్ రహానే నెమ్మదిగా ఆడుతూ 123 బంతుల్లో 56 పరుగులు చేశాడు. రహానే ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క ఫోర్ ఉండటం విశేషం. చివర్లో రిషబ్ పంత్ (11 నాటౌట్) దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. ఇక, అశ్విన్ (0), మహ్మద్ షమీ (0), ఉమేశ్ యాదవ్ (0) వరుసగా డకౌటవడంతో భారత్ 358కే పరుగులకే ఆలౌటైంది.
డిసెంబరు 6న అడిలైడ్ వేదికగా తొలి టెస్టు
కాగా, నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య డిసెంబరు 6న అడిలైడ్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ పర్యటనలో ముగిసిన మూడు టీ20ల సిరిస్‌ను కోహ్లీసేన 1-1తో సమం చేసింది. తొలి టీ20లో ఆతిథ్య జట్టు విజయం సాధించగా, మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. వర్షం కారణంగా రెండో టీ20 రద్దైన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications