న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మొరటువాళ్లు ఇంకెవరూ ఉండరు: కోహ్లీ సంబరాలపై ఆసీస్ కోచ్ అభ్యంతరకర వ్యాఖ్య

Australia would be ‘worst blokes in the world’ for that: Justin Langer on Virat Kohli’s celebrations

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంబరాలపై ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలిటెస్టులో రెండో రోజైన శుక్రవారం ఆసీస్ పేసర్ ఆరోన్ ఫించ్‌ను టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ ఫించ్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన సంగతి తెలిసిందే.

సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్ సరసన కోహ్లీ: ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై మరో రికార్డు సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్ సరసన కోహ్లీ: ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై మరో రికార్డు

ఫించ్ క్లీన్ బౌల్డ్ అనంతరం విరాట్‌ కోహ్లీ తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టులోని ఆటగాళ్లు కూడా విరాట్‌ కోహ్లీలా అత్యుత్సాహం ప్రదర్శిస్తే, ప్రపంచంలో మాకన్నా మొరటువాళ్లు ఇంకెవరూ ఉండరని ఆ జట్టు హెడ్ కోచ్‌ జస్టిన్‌ లాంగర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

1
43623

సంబరాలు చేసుకోడానికి ఒక హద్దు ఉంటుంది

ఈ సందర్భంగా జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ "సంబరాలు చేసుకోడానికి ఒక హద్దు ఉంటుంది. విరాట్‌ కోహ్లీలా మా ఆటగాళ్లు చేస్తే, మా అంత మొరటువాళ్లు ప్రపంచంలో ఎవరూ ఉండరు" అని తొలి టెస్టు మూడో రోజైన శనివారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

సచిన్ రక్షణాత్మక వ్యాఖ్యలపై

అంతేకాదు ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్వదేశంలో ఇంత రక్షణాత్మకంగా ఆడటం తన అనుభవంలో ఎప్పుడూ చూడలేదని సచిన్‌ అన్న వ్యాఖ్యలపై కూడా లాంగర్ స్పందించాడు. "అలెన్‌‌ బోర్డర్‌, డేవిడ్‌ బూన్‌, స్టీవ్‌ వా, మార్క్‌ వా, రికీ పాంటింగ్‌ వంటి దిగ్గజాలతో సచిన్‌ ఆడాడు. వారికి ఎంతో టెస్టు మ్యాచ్‌ అనుభవం ఉంది. జట్టుకు ఏది అవసరమో వారికి తెలుసు" అని పేర్కొన్నాడు.

 ప్రస్తుత ఆటగాళ్లకు టెస్టు అనుభవం తక్కువ

ప్రస్తుత ఆటగాళ్లకు టెస్టు అనుభవం తక్కువ

"వాళ్లు చాలా సులభంగా ఆడగలరు. కానీ, ప్రస్తుతం ఉన్న జట్టులో ఉన్న ఆటగాళ్లకు టెస్టు మ్యాచ్‌ అనుభవం చాలా తక్కువ. ముఖ్యంగా ఈ జట్టులో ఉన్న బ్యాట్స్‌మెన్ల అందరూ యువ ఆటగాళ్లే. వారితో ఓపికగా వ్యవహరించాలి" అని జస్టిన్‌ లాంగర్ చెప్పుకొచ్చాడు. కాగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.

ఉత్సాహంగా కనిపిస్తోన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ

ఇదిలా ఉంటే, అడిలైడ్ టెస్టులో కెప్టెన్ కోహ్లీ చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. ఆసీస్ గడ్డపై భారీ అంచనాల మధ్య తొలి ఇన్నింగ్స్‌లో అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ (3) బ్యాట్‌తో విఫలమైనప్పటికీ, మైదానంలో మాత్రం జట్టులో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 250 పరుగులకి మొదటి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 235 పరుగులకే చాప చుట్టేసింది. మూడో రోజు ఆటలో భాగంగా శనివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు 204 పరుగుల వద్దే మిచెల్ స్టార్క్ (15: 34 బంతుల్లో 1x4) రూపంలో 8వ వికెట్ కోల్పోయింది. దీంతో.. కాసేపు మైదానంలో విరాట్ కోహ్లీ తెగ ఉత్సాహంగా కనిపించాడు.

పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ

పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ

పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసి మరీ అభిమానుల్ని అలరించాడు. మ బ్యాట్స్‌మెన్‌ను అతిగా కవ్వించిన మిచెల్ స్టార్క్ ఔట్ కావడంతో పాటు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు ఆధిక్యం లభించడంతో కోహ్లీ అలా సరదాగా చేసినట్లు తెలుస్తోంది. 91.4 ఓవర్లో బుమ్రా వేసిన బంతిని మిచెల్‌ స్టార్క్‌(15; 34బంతుల్లో) పంత్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికే వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. దీంతో కొంత స‌మ‌యం ఆట నిలిచిపోయింది. మ‌ళ్లీ ఆట మొదలు కాగానే, ష‌మీ మిగ‌తా రెండు వికెట్ల‌ు పడగొట్టాడు. భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా, ఆశ్విన్‌లు మూడేసి వికెట్లు తీసుకోగా, ఇశాంత్ శ‌ర్మ‌, ష‌మీలు రెండేసి వికెట్లు తీసుకున్నారు.

Story first published: Saturday, December 8, 2018, 14:29 [IST]
Other articles published on Dec 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X