T20 World Cup 2022: ఆస్ట్రేలియాకు షాకిచ్చిన న్యూజిలాండ్.. 89 పరుగుల భారీ తేడాతో కివీస్ గెలుపు..

టీ20 వరల్డ్ కప్ లో డిఫెండింగ్ ఛాపింయన్ ఆస్ట్రేలియాకు న్యూజిలాండ్ షాకిచ్చింది. గత ఏడాది జరిగిన ఫైనల్లో ఓటిమికి కివీస్ ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ అన్ని విభాగాల్లో రాణించి 89 తేడాతో భారీ విజయం నమోదు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్ ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే శుభారంభం అందించారు. ముఖ్యంగా ఫిన్ అలెన్ అయితే ఆరంభం నుంచే ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తొలి ఓవర్లనో అతను రెండు బౌండరీలు సిక్స్ బాదగా.. రెండో ఓవర్‌లో డేవాన్ కాన్వే సైతం రెండు ఫోర్లు కొట్టడంతో కివీస్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. ఫించ్ బౌలర్లను మార్చినా.. ఫిన్ అలెన్ మాత్రం తన దూకుడును తగ్గించలేదు. దాంతో కివీస్ 3.5 ఓవర్లలో 50 పరుగులను పూర్తి చేసుకుంది. ఇక హాఫ్ సెంచరీకి చేరువైన ఫిన్ అలెన్‌ను హజెల్ వుడ్ సూపర్ యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 56 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

డేవాన్ కాన్వే
అనంతరం క్రీజులోకి కెప్టెన్ కేన్ విలియమ్సన్ రాగా.. డేవాన్ కాన్వే ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. దాంతో వపర్ ప్లేలో కివీస్ వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం జంపా బంతిని అందుకోగా.. కివీస్ పరుగుల వేగం తగ్గింది. జంపా వేసిన 13వ ఓవర్ తొలి బంతిని సిక్సర్‌గా బాదిన కాన్వే.. 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్ చివరి బంతికి విలియమ్సన్(23) ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్లేన్ ఫిలిప్స్(12) స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు.

హజెల్ వుడ్
హజెల్ వుడ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో జేమ్స్ నీషమ్ ధాటిగా ఆడి స్కోర్ బోర్డును పరుగెత్తించే ప్రయత్నం చేశాడు. మరోవైపు కాన్వే సైతం తన జోరును కొనసాగించాడు. 19వ ఓవర్‌లో మిచెల్ స్టార్క్ 10 పరుగులు మాత్రమే ఇచ్చి భారీ స్కోర్‌కు బ్రేక్ వేసాడు. ఆఖరి ఓవర్‌లో హజెల్ వుడ్ కట్టడిగా వేసినా.. క్విక్ సింగిల్స్, డబుల్స్, ట్రిపుల్స్‌తో కాన్వే-నీషమ్ పరుగులు రాబట్టారు. ఇక చివరి బంతిని నీషమ్ సిక్సర్ బాది జట్టు స్కోర్‌ను 200కు చేర్చాడు.

111 పరుగులకే
201 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 111 పరుగులకే ఆలౌట్ అయింది. కంగారులు ఏ దశలోనూ గెలుపు వైపు ప్రయాణం చేయలేదు. కివీస్ బౌలర్ల కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. వార్నర్ ను 5 పరుగులకే పెవిలయన్ కు చేర్చారు. గ్లెన్ మ్యాక్స్ వెల్ ఒక్కడే 28 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ప్యాట్ కమ్మిన్సి 21 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ, సాట్నర్ మూడేసి వికెట్లు పడగొట్టగా... బౌల్డ్ 2 వికెట్లు తీశాడు. ఫర్గీసన్, సోధి ఒక్కో వికెట్ పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications