Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: ఐర్లాండ్‍పై ఆస్ట్రేలియా విజయం.. ఔరా అనిపించిన లోర్కాన్ టక్కర్..

 Australia won the T20 World Cup against Ireland by 42 runs

ఈ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియా, ఐర్లాండ్ మధ్య జరిగిన సూపర్-12 మ్యాచ్ లో ఐర్లాండ్ పై ఆస్ట్రేలియా 42 పరుగుల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కంగారులు 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేశారు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ ఆదిలోనే డెవిడ్ వార్నర్ వికెట్ కోల్పోయింది. మెక్‌కార్తీ బౌలింగ్ లో ఔటయ్యాడు.

ఫించ్

ఫించ్

ఆ తర్వాత వచ్చిన మిచెల్ మార్ష్, కెప్టెన్ ఫించ్ తో కలిసి మ్యాచ్ ను ముందుకు నడిపించారు. 22 బంతుల్లో 2 సిక్స్ లు, 2 ఫోర్లతో 28 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ మెక్‌కార్తీ బౌలింగ్ పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన మ్యాక్స్ వెల్ 13 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్ ఆరోన్ ఫించ్ స్టోయినిస్ తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నిర్మించాడు. ఈ క్రమంలో ఫించ్ ఆఫ్ సెంచరీ చేశాడు. 44 బంతుల్లో 3 సిక్స్ లు, 5 ఫోర్లతో 63 పరుగులు చేశాడు.

లోర్కాన్ టక్కర్

లోర్కాన్ టక్కర్

స్టోయినిస్ 25 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్స్, మూడు ఫోర్లు ఉన్నాయి. టిమ్ డెవిడ్ 15 పరుగులు చేయగా.. వికెట్ కీపర్ వెడ్ 7 పరుగులు చేశాడు. ఐర్లాండ్ బౌలర్లలో మెక్‌కార్తీ 3 వికెట్లు తీయగా.. లిటిల్ రెండు వికెట్లు పడగొట్టాడు. 180 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ 18.1 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్ అయింది. ఐర్లాండ్ వికెట్ కీపర్ లోర్కాన్ టక్కర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 48 బంతుల్లో ఒక సిక్స్, 9 ఫోర్లతో 71 పరుగులు చేశాడు.

మెక్‌కార్తీ

మెక్‌కార్తీ

ఈ మ్యాచ్ లో మెక్‌కార్తీ అద్భత ఫీల్డింగ్ చేశాడు. 14 ఓవర్ రెండో బంతిని అదిర్ వేయగా.. స్టోయినిస్ దాన్ని సిక్స్ కొట్టాలని పైకి లేపాడు. బంతి గాల్లో లేచింది. పరుగెత్తుకుంటూ వచ్చిన మెక్‌కార్తీ క్యాచ్ పట్టాడు. కానీ బౌండరీలో పడిపోతున్నానని తెలిసి బంతిని బయటకు వేశాడు. దీంతో ఆస్ట్రేలియాకు రెండు పరుగులే వచ్చాయి.

Story first published: Monday, October 31, 2022, 17:12 [IST]
Other articles published on Oct 31, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+