Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత బ్యాట్స్ మెన్ విఫలం: ఆసీస్ భారీ గెలుపు


Johnson వడదొర: భారత్ తో జరిగిన ఐదో వన్డే క్రికెట్ మ్యాచులో గురువారం ఆస్ట్రేలియా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆస్ట్రేలియా ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 149 పరుగుల లక్ష్యాన్ని 24.1 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది. హెడెన్ 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆర్పీ సింగ్ బౌలింగులో అవుటయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పరుగుల వరదకు భారత బౌలర్లు అడ్డుకట్ట వేయలేకపోయారు. గిల్ క్రిస్ట్ 77 బంతుల్లో 79 పరుగులు చేసి నాటవుట్ గా మిగిలాడు. ఆరు క్యాచులు కూడా పట్టాడు. ఈ సిరీస్ లో అంతగా రాణించని గిల్ క్రిస్ట్ నాలుగు సిక్స్ లతో భారత బౌలర్లకు దడ పుట్టించాడు. కెప్టెన్ పాంటింగ్ 39 పరుగులు చేశాడు. ఈ విజయంతో అస్ట్రేలియా 3-1 స్కోరుతో సిరీస్ లో ముందంజలో ఉంది. తదుపరి రెండు మ్యాచులను గెలిస్తే మాత్రమే భారత్ సిరీస్ ను సమం చేయగలుగుతుంది.

అంతకు ముందు భారత టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్ జాన్సన్ ధాటికి భారత బ్యాట్స్ మెన్ వరుసగా పెవిలియన్ దారి పట్టారు. సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ పరుగులేమీ చేయకుండానే అవుటయ్యారు. గంగూలీ రన్నవుట్ అయ్యాడు. కెప్టెన్ ధోనీ కూడా నాలుగు పరుగులకే వికెట్ ను కోల్పోయాడు. భారత్ 50 ఓవర్లు పూర్తిగా ఆడలేకపోయింది. చివర్లో తొమ్మిదో వికెట్ కు జహీర్ ఖాన్ చేసిన పరుగులే అత్యంత విలువైనవిగా మిగిలాయి. భారత్ 39.4 ఓవర్లలో 148 పరుగులు చేసింది. జహీర్ ఖాన్ 28 పరుగులు చేశాడు. అతనికి అర్పీ సింగ్ చక్కని సహకారం అందించాడు.

తన 400 వన్డే ఆడుతున్న సచిన్ టెండూల్కర్ 47 పరుగులు చేసి అవుటయ్యాడు. భారత్ ఒకానొక సందర్భంలో 43 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. 107 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. నాలుగో వన్డేలో అదరగొట్టిన రాబిన్ ఊతప్ప 5 పరుగులు, ధోనీ 4 పరుగులు, యువరాజ్ 1 పరుగు చేశారు. ఇర్పాన్ పఠాన్ 26 పరుగులు చేశాడు. పఠాన్, సచిన్ జోడీ 41 పరుగులు జోడించగా, జహీర్ ఖాన్, ఆర్పీ సింగ్ ల జోడీ 41 పరుగులు జోడించింది. జాన్సన్ 26 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. బ్రెట్ లీకి రెండు వికెట్లు వచ్చాయి.
Story first published: Thursday, October 11, 2007, 23:53 [IST]
Other articles published on Oct 11, 2007
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+