For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియా వుమెన్స్ కెప్టెన్ సంచలన నిర్ణయం.. నా ప్రైవసీని మన్నిస్తారని పేర్కొంటూ..!

Australia Womens Captain Meg Lanning Took A Indefinite Break and Says Give Privacy To her

ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ టీం కెప్టెన్ మెగ్ లానింగ్ సంచలన నిర్ణయం తీసుకుంది. నిరవధికంగా క్రికెట్‌కు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ 30 ఏళ్ల క్రికెటర్.. ఆస్ట్రేలియా టీం విజయాల్లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్ల తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొంది. అలాగే తన ప్రైవసీని మన్నించాలని అభ్యర్థించింది. ఆస్ట్రేలియా వుమెన్స్ టీంకు అత్యధిక మ్యాచ్‌లు కెప్టెన్సీ వహించిన ప్లేయర్‌గా మెగ్ లానింగ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఆమెకు క్రికెట్ ఆస్ట్రేలియా మద్దతు ఇచ్చింది. తగినంత కాలం బ్రేక్ తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది.

ఆమెకు చేయూత అందిస్తూనే ఉంటాం

ఆమెకు చేయూత అందిస్తూనే ఉంటాం

'మెగ్‌ విరామం కావాలని కోరింది.. ఈ సమయంలో ఆమెకు మేం మద్దతుగా నిలబడతాం. ఆమెకు కావాల్సినంత బ్రేక్ ఇస్తున్నాం. ఆమె గత దశాబ్దంలో ఆస్ట్రేలియన్ క్రికెట్‌కు ఎనలేని సేవ చేసింది. వ్యక్తిగతంగా, జట్టు కెప్టెన్సీ పరంగా విశేషమైన విజయాలు సాధించింది. యంగ్ క్రికెటర్లకు రోల్ మోడల్‌గా ఉంది. మా ఆటగాళ్ల సంక్షేమం ఎల్లప్పుడూ మా ప్రథమ ప్రాధాన్యత. మెగ్‌కు అవసరమైన మద్దతు, స్పేస్ దొరికేలా మేము ఆమెకు చేయూత అందిస్తూనే ఉంటాము' అని క్రికెట్ ఆస్ట్రేలియా వుమెన్స్ క్రికెట్ హెడ్ షాన్ ఫ్లెగ్లర్ అన్నారు.

ఎందుకు బ్రేక్ తీసుకుంటుందో మాత్రం చెప్పలేదు

ఎందుకు బ్రేక్ తీసుకుంటుందో మాత్రం చెప్పలేదు

ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియా వుమెన్స్ టీం ఆధిపత్యం కొనసాగుతుంది. మెగ్ లానింగ్ కెప్టెన్సీలో ఆ జట్టు అగ్రస్థానంలో ఉంది. గత రెండేళ్లలో యాషెస్ సిరీస్ విజయంతో పాటు టీ20ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్ ట్రోఫీలను మెగ్ లానింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా అందుకుంది. ప్రస్తుతానికి లానింగ్ ఎప్పుడు మళ్లీ జట్టులోకి వస్తుందనే విషయమై క్లారిటీ లేదు. ఆమె తన నిర్ణయం గురించి ఒక ప్రకటనను రాసింది. గత రెండేళ్లుగా బిజీబిజీ షెడ్యూళ్ల తర్వాత నేను నాపై దృష్టి కేంద్రీకరించడానికి కాస్త సమయం తీసుకోవాలనుకుంటున్నాను. ఈ సమయంలో క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి, నా సహచరుల నుంచి అందుతున్న మద్దతుకు నేను కృతజ్ఞురాలిని. ఈ సమయంలో నా ప్రైవసీని గౌరవించాలని అడుగుతున్నాను.' అంటూ తాను ఎందుకు బ్రేక్ తీసుకుంటుందో మాత్రం లానింగ్ చెప్పలేదు.

అలన్ బోర్డర్, రికీ పాంటింగ్ తర్వాత..

అలన్ బోర్డర్, రికీ పాంటింగ్ తర్వాత..

ప్రస్తుతం మహిళల క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్‌లలో మెగ్ లానింగ్ ఒకరు. ప్రస్తుతం ఐసీసీ టీ20I ర్యాంకింగ్స్‌లో ఆమె 2వ స్థానంలో కొనసాగుతుంది. అలాగే వన్డేలలో అయిదో స్థానంలో ఉంది. 2010లో అరంగేట్రం చేసిన లానింగ్ 2014లో కెప్టెన్‌గా నియమితురాలైంది. కెప్టెన్ అయ్యే టైంకు ఆమెకు కేవలం 21ఏళ్లే. అప్పటి నుండి లానింగ్ ఆస్ట్రేలియాకు రికార్డు స్థాయిలో 171మ్యాచ్‌లకు సారథ్యం వహించింది. ఆమె అలన్ బోర్డర్, రికీ పాంటింగ్ తర్వాత ఆస్ట్రేలియా జాతీయ క్రికెట్ జట్టుకు అత్యధిక మ్యాచ్‌లు కెప్టెన్సీ వహించిన ప్లేయర్‌గా ఉంది. ఇక మెగ్ లానింగ్ గైర్హాజరీలో ఆస్ట్రేలియా టీం కొత్త కెప్టెన్ కోసం వెంపర్లాడుతోంది. త్వరలోనే అయిదు టీ20ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా భారత్‌లో పర్యటించనుంది.

Story first published: Wednesday, August 10, 2022, 16:25 [IST]
Other articles published on Aug 10, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+