For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చరిత్రలో ఫస్ట్ టైమ్.. ఒకే బంతికి నో బాల్, హిట్ వికెట్, సిక్సర్! (Video)

ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మహిళల మూడో వన్డేలో ఆసక్తికర సంఘటన జరిగింది. ఒకే బంతికి నో బాల్, హిట్ వికెట్, సిక్సర్‌ చోటు చేసుకున్నాయి. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఈ అరుదైన ఘటన జరిగింది. 48వ ఓవర్ ఆఖరి బంతిని దక్షిణాఫ్రికా పేసర్ క్లాస్ నో బాల్‌గా వేయగా ఇది సంభవించింది.

అయితే ఆ నో బాల్‌ను అలన కింగ్ భారీ షాట్‌కు యత్నించింది. ఈ క్రమంలో అదుపుతప్పి వికెట్లకు బ్యాటు తాకించి హిట్ వికెట్ అయ్యింది. మరోవైపు బంతి సిక్సర్‌గా మారింది. అయితే అంపైర్ నో బాల్‌గా ప్రకటించడంతో ఔట్ నుంచి అలన తప్పించుకుంది. అంతేగాక ఆమె ఆరు పరుగులు తన ఖాతాలో వేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. క్రికెట్ చరిత్రలో ఇలాంటి సంఘటన చూడటం ఇదే ఫస్ట్ టైమ్ అని, అలన అదృష్టం మామూలుగా లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Australia Women vs South Africa Women: No ball, hit wicket, six in one ball.. First time in history

కాగా, టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 277 పరుగులు చేసింది. అయితే ఆదిలోనే ఆసీస్‌కు షాక్ తగిలింది. ఓపెనర్ లిచ్‌ఫీల్డ్ (5) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరింది. వన్‌డౌన్‌‌లో వచ్చిన ఎలిసా పెరీ (24; 32 బంతుల్లో)తో కలిసి కెప్టెన్ హీలీ (60; 73 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దింది. వీరిద్దరు రెండో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. కానీ స్వల్పవ్యవధిలోనే ఔటయ్యారు.

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన తహిల (44; 35 బంతుల్లో)తో కలిసి బెత్ మూనీ (82; 91 బంతుల్లో) స్కోరుబోర్డును ముందుకు నడిపించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో క్లాస్ నాలుగు వికెట్లతో సత్తాచాటింది. కాగా, మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా విజయం సాధించగా, రెండో వన్డే సౌతాఫ్రికా గెలిచింది. ఇవాళ నిర్ణయాత్మక ఆఖరి వన్డే జరుగుతోంది.

Story first published: Saturday, February 10, 2024, 15:57 [IST]
Other articles published on Feb 10, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+