న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 ప్రపంచకప్‌: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్.. ముగ్గురు స్పిన్నర్లతో భారత్

Australia Women vs India Women: Australia Women have won the toss and have opted to field

సిడ్నీ: టీ20 ప్రపంచకప్‌ మొదటి మ్యాచ్‌లో శుక్రవారం డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో భారత్‌ అమీతుమీ తేల్చుకోనుంది. మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. 'ఇక్కడి పరిస్థితుల గురించి మాకు పెద్దగా అవగానే లేదు కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. పచ్చిక ఉన్న నేపథ్యంలో మొదటగా బౌలింగ్ ఎంచుకున్నాం' అని లానింగ్ తెలిపారు.

క్రికెట్‌ చరిత్రలో ఒకేఒక్కడు.. తొలి క్రికెటర్‌గా రాస్‌ టేలర్‌ ప్రపంచ రికార్డు!!క్రికెట్‌ చరిత్రలో ఒకేఒక్కడు.. తొలి క్రికెటర్‌గా రాస్‌ టేలర్‌ ప్రపంచ రికార్డు!!

'మేము మొదట ఫీల్డింగ్ చేయాలనుకున్నాం. కానీ.. టాస్ మన చేతుల్లో ఉండదు. ఇక్కడ మంచి క్రికెట్ ఆడాలనుకుంటున్నాం. ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగుతున్నాం. ఇక్కడ మాకు చాలా మద్దతు లభిస్తోంది. మేము మా సహజ ఆట ఆడాలని కోరుకుంటున్నాం' అని భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అన్నారు.

ఇటీవల ఆసీస్‌ వేదికగా జరిగిన ముక్కోణపు టీ20 టోర్నీలో ఫైనల్‌ చేరిన హర్మన్‌ప్రీత్‌ బృందం తుదిమెట్టుపై ఆసీస్‌ చేతిలో ఓటమి పాలైంది. అయితే ఆ మ్యాచ్‌లో చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకున్నామంటున్న హర్మన్‌ గ్యాంగ్‌ తొలి పోరులోనే కంగారూలకు చెక్‌ పెట్టి అదిరిపోయే బోణీ కొట్టాలని భావిస్తున్నది. మిడిలార్డర్‌లో అనుభవలేమితో ఇబ్బంది పడుతున్న భారత్‌.. టాపార్డర్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నది. స్టార్‌ ప్లేయర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తప్ప మిగిలినవారు ఒత్తిడిని ఎలా తట్టుకుంటారనేది ముఖ్యం.

బ్యాటింగ్‌లో యువ ఓపెనర్‌ షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌ కీలకం కానున్నారు. స్టార్‌ ప్లేయర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బాధ్యతగా ఆడాల్సిన అవసరం ఉంది. ఇక సీనియర్‌ పేసర్‌ జులన్‌ గోస్వామి అందుబాటులో లేకపోవడంతో భారత జట్టు మరోసారి స్పిన్నే ప్రధానాస్త్రంగా బరిలో దిగనుంది. పూనమ్‌ యాదవ్‌, రాధ యాదవ్‌, దీప్తి శర్మ బంతితో ప్రత్యర్థిని బెంబేలెత్తించేందుకు రెడీ అవుతున్నారు.

Teams:
India Women:
Shafali Verma, Smriti Mandhana, Jemimah Rodrigues, Harmanpreet Kaur(c), Deepti Sharma, Veda Krishnamurthy, Shikha Pandey, Taniya Bhatia(w), Arundhati Reddy, Poonam Yadav, Rajeshwari Gayakwad.

Australia Women:
Alyssa Healy(w), Beth Mooney, Ashleigh Gardner, Meg Lanning(c), Ellyse Perry, Rachael Haynes, Annabel Sutherland, Jess Jonassen, Delissa Kimmince, Molly Strano, Megan Schutt.

Story first published: Friday, February 21, 2020, 13:37 [IST]
Other articles published on Feb 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X