Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

15 ఏళ్ల తర్వాత విదేశీ గడ్డపై ముక్కోణపు సిరిస్ సిద్ధమైన ఆస్ట్రేలియా

Australia women's Under-19 to play after 15-year hiatus

హైదరాబాద్: ఆస్ట్రేలియా అండర్‌ 19 మహిళా క్రికెట్‌ జట్టు 15 ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్ ఆడేందుకు సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న ఆసీస్‌ అండర్‌ 19 మహిళా జట్టు.. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లతో కలిసి ముక్కోణపు సిరిస్‌లో తలపడనుంది.

తద్వారా 15 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా అండర్‌ 19 మహిళా జట్టు ఓ అంతర్జాతీయ సిరిస్‌లో పాల్గొనబోతోంది. చివరిసారిగా 2003లో స్వదేశంలో ఇంగ్లాండ్‌తో తలపడిన ఆస్ట్రేలియా ఆ తర్వాత ఇంత కాలానికి విదేశీ గడ్డపై తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ అడేందుకు సిన్నద్ధమైంది.

అంతేకాదు ఆస్ట్రేలియా అండర్‌ 19 మహిళా జట్టుకు ఇదే తొలి విదేశీ పర్యటన కావడం విశేషం. ఈ పర్యటన కోసం క్రికెట్ ఆస్ట్రేలియా మహిళల యూత్ సెలక్షన్ ప్యానెల్ 14 మంది జట్టు సభ్యులతో కూడిన జట్టుని ప్రకటించింది. ఈ పర్యనటలో భాగంగా 50 ఓవర్ల ముక్కోణపు సిరీస్‌తో పాటు, రెండు టీ20 మ్యాచ్‌లను ఆస్ట్రేలియా జట్టు ఆడనుంది.

50 ఓవర్ల ముక్కోణపు సిరిస్ ఏప్రిల్ 12 నుంచి 18 వరకు జరగనుండగా... రెండు టీ20లు ఏప్రిల్ 24, 26 తేదీల్లో జరగనున్నాయి. ఇక, 50 ఓవర్ల ఫైనల్స్ మ్యాచ్ ఏప్రిల్ 28వ తేదీన జరగనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా అండర్‌ 19 మహిళా వన్డే క్రికెట్‌ కెప్టెన్‌గా 16 ఏళ్ల రాచెల్‌ ట్రెనామన్‌ను ఎంపిక చేయగా, టీ20 జట్టుకు కెప్టెన్‌గా సస్కియా హార్లీ ఎంపికైంది.

ఆస్ట్రేలియా అండర్-19 జట్టు:
Stella Campbell (NSW), Maddy Darke (NSW), Hannah Darlington (NSW), Josephine Dooley (Queensland), Ellen Falconer (South Australia), Nicole Faltum (Victoria), Saskia Horley (NSW), Hayley Silver-Holmes (NSW), Annabel Sutherland (Victoria), Rachel Trenaman (NSW), Tayla Vlaeminck (Victoria), Georgia Wareham (Victoria), Courtney Webb (Tasmania), Tahlia Wilson (NSW)

Story first published: Thursday, March 1, 2018, 21:12 [IST]
Other articles published on Mar 1, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+