For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌లో పర్యటించనున్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు

Australia women's cricket team to tour India in March 2018 for ODIs, T20 tri-series

హైదరాబాద్: ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు భారత్‌లో 2018లో పర్యటించనుంది. మార్చి 2018లో జరగనున్న వన్డే మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా మహిళా జట్టు భారత్‌కు రానుంది. బరోడా వేదికగా మూడు వన్డే మ్యాచ్‌లు మార్చి 12 నుంచి 18 వరకు జరగనున్నాయి. ఆ తర్వాత భారత్‌-ఇంగ్లాండ్‌-ఆస్ట్రేలియా మధ్య ముక్కోణపు టీ20 సిరీస్‌ జరగనుంది. ఈ మేరకు బీసీసీఐ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది.

మూడు వన్డేల పర్యటన కంటే ముందుగా ఆసీస్‌ జట్టు భారత్‌-ఎతో రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడనుంది. మార్చి 6వ తేదీ, 8వ తేదీల్లోనూ జరిగే రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ముంబైలో జరగనున్నాయి. ముక్కోణపు టీ20 మ్యాచ్‌లకూ సంబంధించిన ఆతిథ్య వ్యవహారాలు మొదలైనవి ముంబై పర్యవేక్షించనుంది.

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య వన్డే షెడ్యూల్‌
తొలి వన్డే- మార్చి 12
రెండో వన్డే- మార్చి 15
మూడో వన్డే- మార్చి 18
భారత్‌-ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌ టీ20 సిరీస్‌ షెడ్యూల్‌
మార్చి 22- భారత్‌×ఆస్ట్రేలియా
మార్చి 24- ఆస్ట్రేలియా×ఇంగ్లాండ్‌
మార్చి 26- భారత్‌×ఇంగ్లాండ్‌
మార్చి 28- భారత్‌×ఆస్ట్రేలియామార్చి 30- ఆస్ట్రేలియా×ఇంగ్లాండ్‌
ఏప్రిల్‌ 1- భారత్‌×ఇంగ్లాండ్‌
ఏప్రిల్‌ 3- ఫైనల్‌
ఒక పక్క ఐపీఎల్‌.. మరో పక్క మహిళల మ్యాచ్‌లు. దీంతో క్రికెట్‌ అభిమానులకు వచ్చే ఏడాది వేసవి అంతా సందడే సందడి.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 23, 2017, 16:09 [IST]
Other articles published on Dec 23, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+