న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మహిళా క్రికెటర్‌కు సర్‌ప్రైజ్‌: మైదానంలోనే ప్రపోజ్ చేసిన బాయ్‌ఫ్రెండ్ (వీడియో)

 Australia woman cricketer gets marraige proposal from boyfriend on field

హైదరాబాద్: ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్‌కు మైదానంలో ఆమె బాయ్‌ఫ్రెండ్ ఊహించని షాకిచ్చాడు. అడిలైడ్‌ స్ట్రయికర్స్‌ క్రికెటర్‌ అమందా జేడ్‌ వెల్లింగ్టన్‌కు ఆమె బాయ్‌ఫ్రెండ్‌ టేలర్‌ మెక్‌కిచీనీ మైదానంలోనే మ్యారేజి ప్రపోజల్ చేశాడు. పెళ్లి చేసుకుంటానంటూ మోకాళ్లపై కూర్చొని మైదానంలోనే ఆమెకు ప్రపోజ్‌ చేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ రెనగేడ్స్‌-అడిలైడ్‌ స్ట్రయికర్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మెల్‌బోర్న్‌ రెనగేడ్స్‌పై విజయం సాధించిన తర్వాత అడిలైడ్‌ స్ట్రయికర్స్‌ లెగ్‌ స్పిన్నర్‌ అమందా సహచరులతో కలసి సంబరాలు చేసుకుంటోంది.

71 ఏళ్ల బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు: రాంచీ టెస్టులో నమోదైన రికార్డులివే!71 ఏళ్ల బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు: రాంచీ టెస్టులో నమోదైన రికార్డులివే!

జట్టుతో కలిసి గ్రూప్‌ ఫొటో దిగుతున్న సమయంలో ఆమె ప్రియుడు టేలర్‌ మెక్‌కిచీనీ మైదానంలోకి వచ్చి ఉంగరాన్ని చూపిస్తూ ఆమె చేతిని తనకు అందివ్వాల్సిందిగా కోరాడు. మైదానంలో జట్టు సహచరుల మధ్య ఈ సంఘటనకు ఊహించని అమందా సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. అయితే, ఆ తర్వాత సిగ్గుతోనే తన చేయిని బాయ్‌ఫ్రెండ్‌ అందించింది.

ఈ సమయంలో వెనుకన ఉన్న టీమ్‌మేట్స్‌ ఈలలు, కేకలతో వీరిని అభినందించారు. అనంతరం అమందా మాట్లాడుతూ "అసలు ఏం జరుగుతోందో కాసేపు అర్థం కాలేదు. కానీ నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది" అని అమందా తెలిపింది. కాగా, ఆస్ట్రేలియా జాతీయ జట్టు తరఫున అమందా 8 టీ20లు, 12 వన్డేలు, ఒక టెస్ట్‌ మ్యాచ్‌ ఆడింది.

Story first published: Monday, October 21, 2019, 10:00 [IST]
Other articles published on Oct 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X