
తొలి ఇన్నింగ్స్‌లో భారీ అధిక్యం
అఖరిదైన ఐదో టెస్టు మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 303 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు బ్యాటర్ హెడ్(101) సెంచరీతో చెలరేగగా.. గ్రీన్ హాఫ్ సెంచరీ(74)తో సత్తా చాటాడు. ఇంగ్లండ్ జట్టులో బ్రాడ్, వుడ్ మూడేసి వికెట్లు, రాబిన్సన్, వోక్స్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 188 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ మార్క్ అందుకోలేకపోయాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కెప్టెన్ కమిన్స్ 4, స్టార్క్ 3, బోలాండ్, గ్రీన్ చెరో వికెట్ తీశారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో అతిథ్య ఆస్ట్రేలియాకు 115 పరుగుల భారీ అధిక్యం లభించింది.

రెండో ఇన్నింగ్స్‌ల్లో బౌలర్ల హవా
ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఇరు జట్ల బౌలర్ల సత్తా చాటారు. దీంతో బ్యాటర్లకు ఎక్కువగా పరుగులు లభించలేదు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ల సైతం విఫలమవడంతో ఆ జట్టు 155 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ మార్క్ అందుకోలేకపోయాడు. ఇంగ్లండ్ బౌలర్ మార్క్ వుడ్ 6 వికెట్లతో చెలరేగాడు. బ్రాడ్ 3, క్రిస్ వోక్స్ ఒక్క వికెట్ తీశారు. అనంతరం 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పర్యటక జట్టు ఇంగ్లండ్ ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. కనీసం ఒక్క బ్యాటర్ కూడా రాణించకపోవడంతో 124 పరుగులకే కుప్పకూలింది. దీంతో 3 రోజుల్లోనే ముగిసిన చివరి టెస్ట్ మ్యాచ్‌లో అతిథ్య ఆస్ట్రేలియా 146 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. నాలుగో టెస్టు మ్యాచ్ డ్రా కావడంతో ఇంగ్లండ్ వైట్ వాష్ నుంచి తప్పించుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తోపాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావియస్ హెడ్‌కు దక్కింది.

యాషెస్‌లో సత్తా చాటిన ఆస్ట్రేలియా
యాషెస్ సిరీస్ మొత్తంలో అతిథ్య ఆస్ట్రేలియా సత్తా చాటింది. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-0తో కైవసం చేసుకుంది. 1, 2, 3, 5వ టెస్టు మ్యాచ్‌లను గెలుచుకుంది. నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది.


Click it and Unblock the Notifications












