Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

20 ట్వంటీలో ఆసీస్ ఘనవిజయం

Adam Gilchrist

మెల్బోర్న్: ట్వంటీ - 20 క్రికెట్ మ్యాచులో భారత్ పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ట్వంటీ - 20లో ప్రపంచ ఛాంపియన్ భారత్ పై ఆస్ట్రేలియాకు ఇదే తొలి విజయం. పాంటింగ్ స్థానంలో మైకెల్ క్లార్క్ ఆస్ట్రేలియా జట్టుకు నాయకత్వం వహించాడు. భారత్ ఉంచిన 74 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఆస్ట్రేలియా గిల్ క్రిస్ట్ వికెట్ ను కోల్పోయి 11.2 ఓవర్లలో 75 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. గిల్ క్రిస్ట్ 25 పరుగులు చేసి ప్రవీణ్ కుమార్ బౌలింగులో అవుట్ కాగా మైకెల్ క్లార్క్ 37 పరుగులతోనూ, హోగ్డే 10 పరుగులతోనూ నాటవుట్ గా మిగిలారు.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 74 పరుగులకే కుప్పకూలింది. ఇర్పాన్ ఫఠాన్ తప్ప ఎవరూ రెండంకెల స్కోరు సాధించలేకపోయారు. ఇర్ఫాన్ పఠాన్ 26 పరుగులు చేశాడు. సెహ్వాగ్ పరుగులేమీ చేయకుండా రన్నవుట్ అయ్యాడు. గంభీర్ 9, కార్తిక్ 8, ఉతప్ప 1, రోహిత్ శర్మ 8, ధోనీ 9, ప్రవీణ్ 6 పరుగులు చేశారు. హర్భజన్ 1 పరుగు చేయగా, ఇషాంత్ శర్మ 3 పరుగులు చేసి నాటవుట్ గా మిగిలాడు. హర్భజన్ సింగ్ డకవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో బ్రేకన్ మూడు వికెట్లు తీసుకోగా హోగ్స్ 2 వికెట్లు తీసుకున్నాడు. బ్రెట్ లీ, హోడ్కే, హస్సీ ఒక్కటేసి వికెట్లు తీసుకున్నారు.
Story first published: Friday, February 1, 2008, 17:09 [IST]
Other articles published on Feb 1, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+