Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

26 ఏళ్లకే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్!

ఆస్ట్రేలియా యువ స్టార్ క్రికెటర్ విల్ పుకోవ్‌స్కీ ఆటకు వీడ్కోలు పలకడానికి సిద్ధమయ్యాడు. వైద్య నిపుణుల సూచనల మేరకు 26 ఏళ్లకే ఈ నిర్ణయం తీసుకోనున్నాడు. 2021లో సిడ్నీ వేదికగా భారత్‌తో జరిగిన టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించిన విల్ భవిష్యత్ బ్యాటింగ్ స్టార్‌గా దిగ్గజాల నుంచి ప్రశంసలు పొందాడు. డేవిడ్ వార్నర్ స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్‌గా భారీ అంచనాలు అందుకున్నాడు. కానీ కంకషన్ అతని కెరీర్‌ను ముగించింది.

విల్ పుకోవ్‌స్కీకి వరుసగా తలకు గాయాలవ్వడం అతని కెరీర్‌ను దెబ్బతీసింది. కంకషన్‌తో మ్యాచ్‌లకు తరుచూ దూరమైన అతను వైద్య నిపుణుల సూచనలతో ఆటకే ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాడు. అతని క్రికెట్‌ కెరీర్‌లో ఇప్పటీవరకు 13 సార్లు కంకషన్‌కు గురికావడం గమనార్హం. చివరిగా ఈ ఏడాది మార్చిలో షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో విల్ హెల్మెట్‌కు బంతి బలంగా తాకింది. ఆ తర్వాత కంకషన్‌తో సీజన్ మొత్తానికి దూరమైన విల్ తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు. ఇంగ్లాండ్‌ కౌంటీ జట్టు లీసెస్టర్‌షైర్‌తో ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకున్నాడు.

Australia s Will Pucovski Retires at 26 Due to Repeated Head Injuries and Concussions

విక్టోరియా తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డులు సాధించిన విల్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. 2021లో సిడ్నీ వేదికగా భారత్‌తో జరిగిన టెస్టులో 72 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో అర్ధశతకం (62) బాదాడు. అయితే ఆ మ్యాచ్‌లో విల్‌ భుజానికి గాయమైంది. ఆ గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు ఆరు నెలల సమయం తీసుకున్నాడు.

ఇతర గాయాలు, కంకషన్‌తోనే కాకుండా మానసిక సమస్యలతో ఆటకు విల్ కొంత కాలం దూరమయ్యడు. అయితే విల్ తన ఆటతో అందరి దృష్టి ఆకర్షించాడు. ద్విశతకాలు బాది భవిష్యత్ స్టార్‌గా గుర్తింపు పొందాడు. 21 ఏళ్ల లోపే డబుల్ సెంచరీ బాదిన ఎనిమిదో ఆస్ట్రేలియన్‌గా డాన్ బ్రాడమ్‌న్, ఇయాన్ చాపెల్, రికీ పాంటింగ్ వంటి దిగ్గజాల సరసన నిలిచాడు. పరుగుల వరద పారిస్తూ తిరిగి టీమిండియా సిరీస్‌కు ఎంపికయ్యాడు. కానీ ఆస్ట్రేలియా- ఎ తరపున ఆడుతూ కంకషన్‌కు గురయ్యాడు.

విల్ తన కెరీర్‌లో 36 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 14 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 45 సగటుతో 2350 పరుగులు చేశాడు. ఏడు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలు బాదాడు.ఇక లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 27 సగటుతో 333 పరుగులు చేశాడు. ఓ శతకం, రెండు అర్ధశతకాలు సాధించాడు.

Story first published: Friday, August 30, 2024, 9:31 [IST]
Other articles published on Aug 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+