
తప్పుగా ఏం అనిపించలేదు
‘విరాట్ అలా సంబరాలు చేసుకోవడం, తప్పుగా ఏం అనిపించలేదు. అది అతడికి ఆటపై ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తోంది. ఆసీస్ ఆటగాళ్లు దుర్భాషలాడుతూ సంబరాలు చేసుకుంటారు. అందుకే ఆస్ట్రేలియా జట్టుకు చెడ్డ పేరుంది. లాంగర్ సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. అలాంటిదేమీ జరగదు' అని గవాస్కర్ అన్నాడు.

కోహ్లీలా అత్యుత్సాహం ప్రదర్శిస్తే
దీంతో ఆస్ట్రేలియా జట్టులోని ఆటగాళ్లు కూడా విరాట్ కోహ్లీలా అత్యుత్సాహం ప్రదర్శిస్తే, ప్రపంచంలో మాకన్నా మొరటువాళ్లు ఇంకెవరూ ఉండరని ఆ జట్టు హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ "సంబరాలు చేసుకోడానికి ఒక హద్దు ఉంటుంది. విరాట్ కోహ్లీలా మా ఆటగాళ్లు చేస్తే, మా అంత మొరటువాళ్లు ప్రపంచంలో ఎవరూ ఉండరు" అని తొలి టెస్టు మూడో రోజైన శనివారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

323 పరుగుల లక్ష్యంతో ఆసీస్
నాలుగో రోజు 323 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఓపెనర్లు ఫించ్, హారిస్ భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. అశ్విన్ బౌలింగ్‌లో ఫించ్ (11) రూపంలో భారత్‌కు తొలి వికెట్ లభించింది. అ తర్వాత వెంటనే మరో ఓపెనర్ హారిస్ (26) షమీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఖవాజ (8), హాండ్స్‌కాంబ్ (14) వికెట్లను తీయడానికి ఎంతో సమయం పట్టలేదు.

మరో 219 పరుగులు దూరంలో
అశ్విన్, షమీ రెండేసి వికెట్లు పడగొట్టారు. షాన్ మార్ష్ (31), ట్రావిస్ హెడ్ (11) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఆసీస్ గెలవాలంటే మరో 219 పరుగులు చేయాల్సి ఉంది. ఆరు వికెట్లు మరొక రోజు ఆట మాత్రమే టీమిండియా ముంగిట మిగిలి ఉంది.


Click it and Unblock the Notifications












