Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్: ప్రపంచ కప్ ముందు హెచ్చరికలు

Australia Whitewash Pakistan 5-0 In ODI Series, Despite Haris Sohail Hundred

దుబాయ్: గత కొద్ది కాలంగా ఒడిదుడుకులకు గురైన ఆస్ట్రేలియా జట్టు వన్డే ప్రపంచకప్ ముందు దూసుకుపోతోంది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో ఆసీస్ 20 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను ఆసీస్ క్లీన్‌స్వీప్ చేసింది. భారత్, పాకిస్థాన్‌ జట్లపై వరుస సిరీస్ విజయాలను సాధించి ప్రపంచ క్రికెట్ జట్లకు హెచ్చరికలు జారీ చేసింది.

108 పరుగుల భాగస్వామ్యం

108 పరుగుల భాగస్వామ్యం

ఆసీస్ నిర్దేశించిన 328 పరుగుల భారీ లక్ష్యఛేదనలో పాక్ జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ అబిద్ అలీ (0) డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ షాన్ మసూద్ (50).. హరిస్ సోహైల్ (130)తో కలిసి ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టాడు. ఈ జోడి ఆసీస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ.. రెండో వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అర్ధ సెంచరీ అనంతరం మసూద్ పెవిలియన్ చేరాడు. అనంతరం రిజవాన్ (12) తక్కువ స్కోరుకే అవుట్ అయ్యాడు.

కెప్టెన్ జట్టును గెలిపించలేకపోయాడు

కెప్టెన్ జట్టును గెలిపించలేకపోయాడు

సోహైల్ మాత్రం ధాటిగా ఆడుతూ.. ఉమర్ అక్మల్ (43)తో కలిసి నాలుగో వికెట్‌కు 102 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే సోహైల్ సెంచరీ సాధించాడు. అయితే 1 పరుగు తేడాతో సోహైల్, అక్మల్ అవుట్ అయ్యారు. చివరలో కెప్టెన్ ఇమాద్ వసీం (50 నాటౌట్) అజేయ అర్ధ సెంచరీతో రాణించినా.. పాక్ జట్టును గెలిపించలేకపోయాడు. పాక్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసి ఓడిపోయింది. ఆసీస్ బౌలర్లలో బెహెన్‌డార్ఫ్ మూడు వికెట్లు తీయగా.. రిచర్డ్‌సన్, లియాన్, మ్యాక్స్‌వెల్, జంపా తలో వికెట్ తీశారు.

అదిరే ఆరంభం

అదిరే ఆరంభం

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 327 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆసీస్ టాపార్డర్ ఆటగాళ్లు ఉస్మాన్ ఖవాజ (98), ఫించ్ (53), షాన్ మార్ష్ (61), మ్యాక్స్‌వెల్ (70)లు అర్ధ సెంచరీలతో రాణించారు. టాపార్డర్ రాణించినా.. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్ స్కోర్ మాత్రమే చేసారు. పాక్ బౌలర్లు ఉస్మాన్ షిన్వారీ 4, జునైద్ ఖాన్ 3 వికెట్లు సాధించారు. మ్యాక్స్‌వెల్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్', ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌కు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' దక్కాయి.

Story first published: Tuesday, April 2, 2019, 11:32 [IST]
Other articles published on Apr 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+