Australia vs Srilanka 5th ODI: ఓడితే ఓడారు కానీ.. ఆస్ట్రేలియాను మామూలుగా వణికించలేదు

శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య చివరి వన్డేలో శ్రీలంక ఓడితే ఓడింది గానీ.. ఆస్ట్రేలియాను వణికించింది. అప్పట్లో ఆస్ట్రేలియా ఓడిపోయినా చివరి దాకా పోరాడుతూ మిగతా జట్లకు ముచ్చెమటలు పట్టించేది. ఇప్పుడు చావు తప్పి కన్ను లొట్టపోయిన చందాన అయిదో మ్యాచ్ ఎలాగోలా శ్రీలంకపై ఆస్ట్రేలియా గెలిచినా.. శ్రీలంక మాత్రం ఆస్ట్రేలియాను మామూలుగా వణికించలేదు. ఇక ఈ సిరీస్ 3-2 తేడాతో శ్రీలంక ఒడిసిపట్టింది. 30ఏళ్ల తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాపై శ్రీలంక సిరీస్ గెలిచింది. ఇక చివరి వన్డే లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు పోరాడినప్పటికీ ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు శ్రీలంక బౌలర్లు చూపిన తెగువ మాత్రం అమోఘం, అనిర్వచనీయం. కుర్రాళ్ల బౌలింగ్ ధాటికి 15ఓవర్ నుంచి 30వ ఓవర్ వరకు ఆస్ట్రేలియా ఒక్క ఫోర్ కూడా కొట్టలేకపోయింది. అంతా కట్టుదిట్టంగా లంకేయులు ఆసీస్‌ను ఆటాడుకున్నారు.

తొలుత 160పరుగులకే శ్రీలంక ఆలౌట్
ఇక తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక బ్యాటర్లు ఆసీస్ బౌలింగ్ ధాటికి తలొగ్గారు. ఆ జట్టు కరుణరత్నే (75పరుగులు 75బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సర్లు) మినహా మిగతవారు పెద్దగా రాణించలేకపోయారు. దీంతో ఇక ఆ జట్టులో కుశాల్ మెండిస్ (26పరుగులు) కాస్త పర్వాలేదనిపిస్తున్న టైంలో హిట్ వికెట్‌గా ఔటయిపోయాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో హజిల్ వుడ్, కుహ్రేమాన్, కమ్మిన్ తలా రెండు వికెట్లు తీయగా.. మ్యాక్స్ వెల్, కామెరున్ గ్రీన్ తలా ఒక వికెట్ తీశారు. దీంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 160పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఛేదనలో ఆస్ట్రేలియాకు చుక్కలు
ఇక తర్వాత బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 39.3ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 164పరుగులు చేసి 4వికెట్ల తేడాతో గెలుపొందింది. ఛేదనలో ఆస్ట్రేలియాకు శ్రీలంక బౌలర్లు చుక్కలు చూపించారు. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మరోసారి డకౌట్ కాగా.. డేవిడ్ వార్నర్ (10) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. జోష్ ఇంగ్లిష్ (5)సైతం ఇటు వచ్చి అటు వెళ్లిపోవడంతో ఆసీస్ 19పరుగులకే 3వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ క్రమంలో మిచెల్ మార్ష్ (24), మార్నష్ లబుషేన్ (31) కాసేపు ప్రతిఘటించారు. 50పరుగుల వద్ద మార్ష్ సైతం పెవిలియన్ బాట పట్టాడు.

అలెక్స్ కెరీ చివరి వరకు నిలబడ్డంతో..
ఇక క్రీజులో దిగిన అలెక్స్ కెరీ (45పరుగులు 65బంతుల్లో 1ఫోర్ నాటౌట్) అత్యంత జాగ్రత్తగా ఆడాడు. లబూషేన్ తో కలిసి 51పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. ఆ తర్వాత లబూషేన్ ఔటయ్యాడు. ఆ తర్వాత మ్యాక్స్ వెల్ (16) ఔటవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠకు దారి తీసింది. కానీ కెమెరన్ గ్రీన్ (25పరుగులు).. కెరీకి అండగా నిలబడ్డంతో ఎట్టకేలకు ఆసీస్ గెలిచింది. శ్రీలంక యువ బౌలర్ దునిత్ వెల్లలాగే తన 10ఓవర్లలో 42పరుగులు ఇచ్చి 3వికెట్లు తీసి.. ఆసీస్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. అలాగే మహీష్ తీక్షణ సైతం 10ఓవర్లలో 26పరుగులు మాత్రమే ఇచ్చి 2వికెట్లు తీసి.. ఆసీస్ బ్యాటర్లు క్రీజులో నిలబడాలంటేనే వణికేలా చేశాడు. ఇకపోతే ఈ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా చమిక కరుణ రత్నే నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా కుశాల్ మెండిస్ నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications