ఆసీస్ vs విండిస్: మరోసారి షెల్డన్ కాట్రెల్ ఆర్మీ సెల్యూట్ సంబరాలు (వీడియో)

హైదరాబాద్: నాటింగ్ హామ్ వేదికగా ఆస్ట్రేలియాతో జురగుతున్న మ్యాచ్‌లో వెస్టిండిస్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ మరోసారి ఆర్మీ సెల్యూట్‌తో అలరించాడు. టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో షెల్డన్ కాట్రెల్ వికెట్ తీసిన ప్రతిసారి మైదానంలో ఆర్మీ సెల్యూట్ చేసి అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
టోర్నీలో భాగంగా గురువారం నాటింగ్ హామ్ వేదికగా ఆస్ట్రేలియా-వెస్టిండిస్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే విండిస్ బౌలర్లు షాకిచ్చారు.
మూడో ఓవర్ రెండో బంతికి
ఇన్నింగ్స్ మూడో ఓవర్ రెండో బంతికి ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ (6) పరుగుల వద్ద ఒషానే థామస్ బౌలింగ్‌లో కీపర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మరో 11 పరుగులకే మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్(3)ను కాట్రెల్ పెవిలియన్‌కు చేర్చాడు. షెల్డన్ కాట్రెల్ వేసిన నాలుగో ఓవర్ ఆఖరి బంతిని షాట్ ఆడిన వార్నర్.. హెట్మేయర్ చేతికి చిక్కాడు.
షెల్డన్ కాట్రెల్ ఆర్మీ సెల్యూట్ సంబరాలు
దీంతో షెల్డన్ కాట్రెల్ తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఐసీసీ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఆ తర్వాత ఉస్మాన్ ఖవాజా (13) పరుగుల వద్ద రసెల్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ షై హోప్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. విధ్వంసకర బ్యాట్స్‌మన్ మ్యాక్స్‌వెల్ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు.
పీకల్లోతు కష్టాల్లో ఆస్ట్రేలియా
దీంతో కీలక వికెట్లను కోల్పోయి ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టోయినిస్(19) కూడా జట్టు స్కోరు 79 పరుగుల వద్ద జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో నికోలస్ పూరన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. విండిస్ బౌలర్ల బౌన్సర్లకు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తుతున్నారు.

నిలకడగా ఆడుతోన్న స్మిత్, క్యారీ
అనంతరం క్రీజులోకి వచ్చిన అలెక్స్ క్యారీతో కలిసి మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నాడు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని నడిపిస్తున్నారు. ప్రస్తుతం 29 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. స్టీవెన్ స్మిత్ (40), మార్కస్ స్టోయినిస్ (44) పరుగులతో క్రీజులో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications