Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆదిలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్.. స్కోర్ 68/4

Australia vs West Indies Match: Early strikes put Australia in deep trouble, Australia lose four wickets

ప్రపంచకప్‌లో భాగంగా గురువారం నాటింగ్‌హామ్ వేదికగా విండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఆరంభంలోనే కీలక నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూడో ఓవర్ రెండో బంతికి ఆసిస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ (6) ఔటయ్యాడు. విండీస్ పేసర్ ఒషానే థామస్‌ బౌలింగ్‌లో కీపర్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం మరో ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ (3)తక్కువ పరుగులకే ఔటయ్యాడు. పేసర్ షెల్డన్‌ కాట్రెల్‌ వేసిన నాలుగో ఓవర్‌ ఆఖరి బంతిని షాట్‌ ఆడిన వార్నర్‌.. హెట్మేయర్‌ చేతికి చిక్కాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

26 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఆసీస్. ఇక వెస్టిండీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఆసిస్‌ బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయలేకపోయారు. ఆదుకుంటాడనుకున్న ఉస్మాన్‌ ఖవాజా (13).. రసెల్ బౌలింగ్‌లో షైహోప్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇక డేంజరస్ మ్యాక్స్‌వెల్‌ (0) ఎనిమిదో ఓవర్‌లో ఔట్ అయ్యాడు. దీంతో కీలక నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

క్రీజులో ఉన్న స్టీవ్ స్మిత్‌ (15), మార్కర్స్ స్టోయినిస్‌ (17)లు నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. విండీస్ బౌలర్ల దాటికి ఈ జోడి పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతోంది. ప్రస్తుతం ఆసీస్ 13 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. షెల్డన్‌ కాట్రెల్‌ రెండు వికెట్లు తీయగా.. ఒషానే థామస్‌, రసెల్ తలో వికెట్ తీశారు.

Story first published: Thursday, June 6, 2019, 16:32 [IST]
Other articles published on Jun 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+