Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏకైక టీ20లోనూ రాణించలేకపోయిన ఆస్ట్రేలియా

Australia vs South Africa T20I, Highlights: Bowlers put a clinic as South Africa win by 21 runs

హైదరాబాద్: ఏకైక టి20లో 21 పరుగుల విజయంతో దక్షిణాఫ్రికా... ఆస్ట్రేలియా పర్యటనను ముగించింది. రెండు జట్ల మధ్య శనివారం ఇక్కడ జరిగిన ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 10 ఓవర్లకు కుదించారు. క్వీన్స్‌లాండ్ వేదికగా ఆసీస్‌తో శనివారం జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన దక్షిణాఫ్రికా 21 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుని మూల్యం చెల్లించుకుంది.

 దూకుడు కొనసాగించిన దక్షిణాఫ్రికా

దూకుడు కొనసాగించిన దక్షిణాఫ్రికా

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టులో ఓపెనర్లు డికాక్ (22: 16 బంతుల్లో 2సిక్సులు), హెండ్రిక్స్ (19: 8 బంతుల్లో 3ఫోర్లు, ఒక సిక్సు) తొలి వికెట్‌కి 2.5 ఓవర్లలోనే 42 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభమివ్వగా.. అనంతరం వచ్చిన కెప్టెన్ డుప్లెసిస్ (27: 15 బంతుల్లో 4ఫోర్లు), హెన్రిచ్ క్లాసెన్ (12), డేవిడ్ మిల్లర్ (11) దూకుడుగా ఆడాడు.

వర్షం కారణంగా 10 ఓవర్లకు 108/6తో

వర్షం కారణంగా 10 ఓవర్లకు 108/6తో

దీంతో ఆ జట్టు వర్షం కారణంగా కుదించిన 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియాకి ఆరంభంలోనే ఆటంకాలు ఎదురైయ్యాయి. కెప్టెన్ అరోన్ ఫించ్ (7), హిట్టర్ క్రిస్‌లిన్ (14), డీఆర్క్ షార్ట్ (0) వరుస ఓవర్లలో తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిపోయారు. ఈ దశలో గ్లెన్ మాక్స్‌వెల్ (38: 23 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సులు) దూకుడుగా ఆడుతూ ఆ జట్టుని గెలిపించే ప్రయత్నం చేసినా.. అతనికి సహకరించే వారు కరువైయ్యారు.

 ఆఖరి ఓవర్ వరకూ మాక్స్‌వెల్ క్రీజులో నిలిచినా..

ఆఖరి ఓవర్ వరకూ మాక్స్‌వెల్ క్రీజులో నిలిచినా..

ఆసీస్‌ బౌలర్లలో కౌల్టర్‌నీల్‌, ఆండ్రూ టై రెండేసి వికెట్లు తీశారు. ఛేదనలో మోరిస్‌ (2/12), ఎంగిడి (2/16), ఫెలుక్వాయో (2/21) ధాటికి ఆసీస్‌ 7 వికెట్లు కోల్పోయింది. స్టాయినిస్ (5), అలెక్స్ (8), మెక్‌డీమాట్ (5), కౌల్టర్ నైల్ (2) సింగిల్ డిజిట్‌కే వరుసగా ఔటవడంతో ఆఖరి ఓవర్ వరకూ మాక్స్‌వెల్ క్రీజులో నిలిచినా.. ఫలితం లేకపోయింది.

మూడు వన్డేల సిరీస్‌ను కూడా సఫారీలే

మూడు వన్డేల సిరీస్‌ను కూడా సఫారీలే

ఆ జట్టు చివరికి 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 87 పరుగులే చేయగలిగింది. ఎంగిడి, మోరిస్‌, పెహ్లుక్వాయో రెండేసి వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. అంతకుముందు వన్డే సిరీ‌స్‌ను సౌతాఫ్రికా 2-1తో దక్కించుకుంది. ఇంతకుముందు జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను కూడా సఫారీలు 2-1తో కైవసం చేసుకున్నారు.

Story first published: Sunday, November 18, 2018, 12:14 [IST]
Other articles published on Nov 18, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+