
హైదరాబాద్: మాంచెస్టర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియాకు 326 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా ఓపెనర్లు మ్యాచ్ ఆరంభం నుంచీ దూకుడుగా ఆడారు. సఫారీ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ డుప్లెసిస్ 94 బంతుల్లో 100 పరుగులు(7 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో రాణించాడు. మరో బ్యాట్స్‌మన్ వాన్‌డర్ డుస్సెన్ 97 బంతుల్లో 95(4ఫోర్లు, 4 సిక్సర్లు) తృటిలో సెంచరీ మిస్సయ్యాడు.
మరోవైపు ఓపెనర్ క్వింటన్ డికాక్ 52 హాఫ్ సెంచరీతో రాణించగా.. మర్క్రమ్ 34 పరుగులతో ఫరవాలేదనిపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియాన్, స్టార్క్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కమిన్స్, బెహ్రాన్‌డార్ఫ్‌లు చెరో రెండు వికెట్‌లు దక్కించుకున్నారు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు మంచి క్రికెట్ ఆడలేదన్న డుప్లెసిస్... ఈ మ్యాచ్‌లో అద్భుతం చేస్తామని టాస్ అనంతరం చెప్పాడు.
చెప్పినట్లే సెంచరీతో చెలరేగాడు. సఫారీ క్రికెటర్లు ఇమ్రాన్ తాహిర్, జెపీ డుమినిలకు ఇదే ఆఖరి మ్యాచ్. ఈ మ్యాచ్ అనంతరం వన్డేలకు గుడ్‌బై చెప్పబోతున్నాడు. ఇక దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌కు కూడా ఈ మ్యాచే చివరిది. పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించి ఈ ఇద్దరు ఆటగాళ్లకు ఘనంగా వీడ్కోలు పలకాలని డుప్లెసిస్‌సేన భావిస్తోంది.
డుమిని ఇప్పటిదాకా 198 వన్డేలు ఆడాడు. ఓల్డ్ ట్రాఫొర్డ్‌లో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో 199వది. తాహిర్ ఇప్పటిదాకా 106 వన్డేలను ఆడాడు. ఓల్డ్ ట్రాఫొర్డ్‌లో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో 107వది. 106 మ్యాచ్‌లల్లో తాహిర్ 172 వికెట్లను పడగొట్టాడు. 2011, 2015 ప్రప్రపంచకప్‌లో డుమిని దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు, 2019 ప్రపంచకప్ మూడోది.
పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జన్మించి తాహిర్ దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డాడు. 2011, 2015 ప్రపంచకప్‌లలో సౌతాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు. 2019 ప్రపంచకప్ తాహిర్‌కు కూడా మూడోదే. ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్‌కు చేరగా సపారీలు టోర్నీ నుంచి నిష్క్రమించారు. దీంతో ఆస్ట్రేలియాకు ఇది నామమాత్రపు మ్యాచే.
{headtohead_cricket_1_6}