Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెరీర్‌లో ఆఖరి వన్డే ఆడుతున్న తాహిర్, డుమిని: ఆసీస్‌పై దక్షిణాఫ్రికా బ్యాటింగ్

Australia vs South Africa Live Score, ICC World Cup 2019 Match at Manchester: South Africa Opt to Bat

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా శనివారం ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నయి. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాస్ అనంతరం డుప్లెసిస్ మాట్లాడుతూ రెండో స్పిన్నర్‌తో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. మోకాలు గాయంతో ఆమ్లా ఈ మ్యాచ్‌కు దూరం కాగా, అతడి స్థానంలో షంసీని తుది జట్టులోకి తీసుకున్నట్లు డుప్లెసిస్ తెలిపాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు మంచి క్రికెట్ ఆడలేదన్న డుప్లెసిస్... ఈ మ్యాచ్‌లో అద్భుతం చేస్తామని చెప్పాడు. కాగా, సఫారీ క్రికెటర్లు ఇమ్రాన్ తాహిర్, జెపీ డుమినిలకు ఇదే ఆఖరి మ్యాచ్. ఈ మ్యాచ్ అనంత‌రం వ‌న్డేలకు గుడ్‌బై చెప్ప‌బోతున్నాడు. ఇక దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌కు కూడా ఈ మ్యాచే చివరిది. పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించి ఈ ఇద్దరు ఆటగాళ్లకు ఘనంగా వీడ్కోలు పలకాలని డుప్లెసిస్‌సేన భావిస్తోంది.

డుమిని ఇప్ప‌టిదాకా 198 వ‌న్డేలు ఆడాడు. ఓల్డ్ ట్రాఫొర్డ్‌లో ఆస్ట్రేలియాతో జ‌రిగే మ్యాచ్‌తో 199వ‌ది. తాహిర్ ఇప్ప‌టిదాకా 106 వ‌న్డేల‌ను ఆడాడు. ఓల్డ్ ట్రాఫొర్డ్‌లో ఆస్ట్రేలియాతో జ‌రిగే మ్యాచ్‌తో 107వ‌ది. 106 మ్యాచ్‌ల‌ల్లో తాహిర్ 172 వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. 2011, 2015 ప్రప్రపంచకప్‌లో డుమిని ద‌క్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు, 2019 ప్రపంచకప్‌ మూడోది. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జన్మించి తాహిర్ దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డాడు.

2011, 2015 ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో సౌతాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు. 2019 ప్రపంచకప్‌ తాహిర్‌కు కూడా మూడోదే. ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్‌కు చేరగా సపారీలు టోర్నీ నుంచి నిష్క్రమించారు. దీంతో ఆస్ట్రేలియాకు ఇది నామమాత్రపు మ్యాచే. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో ఉన్న ఆస్ట్రేలియా... ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతుంది.

అలా కాకుండా ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఓడి, లంకతో జరిగే మ్యాచ్‌లో భారత్ గెలిస్తే మాత్రం రెండో స్థానానికి పడిపోతుంది. మ్యాచ్‌లో గెలిచి అగ్రస్థానంలో ఉంటే నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో సెమీస్‌లో తలపడుతుంది. అలా కాకుండా రెండో స్థానంలో నిలిస్తే ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ ఆడుతుంది.

జట్ల వివరాలు
ఆస్ట్రేలియా:
డేవిడ్ వార్నర్, ఆరోన్ పించ్(కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్ వెల్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జాసన్ బెహ్రాండార్ఫ్, నాథన్ లయాన్

దక్షిణాఫ్రికా: క్వింటన్ డీకాక్(వికెట్ కీపర్), అయిడెన్ మర్క్రమ్, డుప్లెసిస్(కెప్టెన్), వ్యాన్ డెర్ డుస్సెన్, జెపీ డుమిని, ప్రిటోరియస్, అండిల్ ఫెలుక్వాయో, క్రిస్ మోరిస్, కగిసో రబాడ, ఇమ్రాన్ తాహిర్, షంసీ

{headtohead_cricket_1_6}

Story first published: Saturday, July 6, 2019, 18:00 [IST]
Other articles published on Jul 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+