సఫారీ గడ్డపై నమోదైన రికార్డులివే: ఆసీస్ చెత్త ప్రదర్శన

హైదరాబాద్: స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-1తో సొంతం చేసుకుని ఆతిథ్య దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ టెస్టు మ్యాచ్ ఏ ముహుర్తాన ప్రారంభం అయిందో ఏమో తెలియదు గానీ మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఒకడైన స్టీవ్ స్మిత్ ఏడాది పాటు నిషేధానికి గురవ్వాల్సి వచ్చింది.
ఈ నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఎన్నో వివాదాలు, ఎన్నో రికార్డులు క్రికెట్ అభిమానులను అలరించాయి. తొలి టెస్టులో పర్యాటక ఆస్ట్రేలియా జట్టు నెగ్గగా, ఆ తర్వాతి మూడు టెస్టులను ఆతిథ్య దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంది. జోహెన్స్ బర్గ్ వేదికగా జరిగిన చివరి టెస్టులో సఫారీలు 492 పరుగుల భారీ విజయ లక్ష్యంతో గెలిచారు.

టెస్టు చరిత్రలోనే అతిపెద్ద విజయం
దక్షిణాఫ్రికాకు ఇది టెస్టు చరిత్రలోనే అతిపెద్ద విజయం కాగా, స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఇప్పటివరకు జరిగిన 7 సిరీస్‌ల అనంతరం టెస్టు సిరిస్‌ను గెలుచుకోవడం ఇదే మొట్టమొదటిసారి. ఇక పరుగుల పరంగా 1934 తరువాత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇదే అతిపెద్ద విజయం. మొత్తంగా చూస్తే పరుగుల పరంగా నాలుగో అతి పెద్ద విజయం. 1928లో ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాపై 675 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు అత్యుత్తమ గణాంకాలు
టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఇప్పటివరకు ఇదే అతిపెద్ద విజయం. ఆ తర్వాత 1934లో ఆస్ట్రేలియా 562 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. 1911లో ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికాపై 530 పరుగుల తేడాతో నెగ్గింది. ఇక, 2004లో ఆస్ట్రేలియా 491 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై విజయం సాధించింది. పరుగుల పరంగా ఇది ఐదో అతిపెద్ద విజయం. ఈ సిరిస్‌లో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు కూడా అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశారు.

ఆసీస్‌పై ఫిలాండర్ అరుదైన రికార్డు
దక్షిణాఫ్రికా బౌలర్ వెరోన్ ఫిలాండర్ ఆసీస్‌పై ఒక ఇన్నింగ్స్‌లో తక్కువ పరుగులిచ్చి ఆరుకు పైగా వికెట్లు సాధించాడు. తద్వారా బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ (15/8) ఇప్పటివరకు అత్యుత్తమం. జోహెన్స్‌బర్గ్ వేదికగా జరిగిన చివరి టెస్టులో మిచెల్ మార్ష్ వికెట్ తీయడంతో ఫిలాండర్ రెండు వందల వికెట్ల క్లబ్‌లో చేరాడు. ఈ ఘనత సాధించిన ఏడో దక్షిణాఫ్రికా బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

రెండొందల వికెట్లు సాధించిన దక్షిణాఫ్రికా నాలుగో బౌలర్
అంతేకాదు టెస్టుల్లో అత్యంత వేగంగా రెండొందల వికెట్లు సాధించిన దక్షిణాఫ్రికా నాలుగో బౌలర్‌గా నిలిచాడు. మరోవైపు దక్షిణాఫ్రికా ఓపెనర్ మర్క్రామ్ పది టెస్టుల్లోనే వెయ్యి పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా అరుదైన రికార్డు సృష్టించాడు. గతంలో సఫారీ మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 12 టెస్టుల్లో ఈ ఘనత సాధించాడు.

ఆసీస్‌ది అత్యంత చెత్త ప్రదర్శన
ఆస్ట్రేలియా చరిత్రలోనే ఈ నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ అత్యంత చెత్త ప్రదర్శనగా నిలిచిపోయింది. ఆతిథ్య దక్షిణాఫ్రికాకు చెందిన ఆటగాళ్లు ఈ సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేశారు. ఈ సిరీస్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఆటగాళ్లు ఐదు సెంచరీలు సాధించగా, ఆస్ట్రేలియా జట్టు తరుపున ఒక్క ఆటగాడు కూడా సెంచరీ చేయకపోవడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications