Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'కెప్టెన్‌కు సాయపడేందుకే ప్రయత్నిస్తుంటా.. పైన్‌ను తక్కువ చేయడం లేదు'

 Australia vs Pakistan: Steve Smith has reacted to former skipper Ian Chappells claims

అడిలైడ్‌: ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్‌ పైన్‌కు సాయపడేందుకే ప్రయత్నిస్తుంటా. నేను కేవలం సలహాలు మాత్రమే ఇస్తా. పైన్‌ను తక్కువ చేయడం లేదు అని మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ తెలిపాడు. పైన్‌ను స్మిత్‌ తక్కువగా అంచనా వేస్తున్నాడన్న ఆసీస్‌ మాజీ సారథి ఇయాన్‌ ఛాపెల్‌ వ్యాఖ్యలపై స్మిత్‌ పైవిధంగా స్పందించాడు. పాకిస్తాన్‌తో ముగిసిన డే/నైట్‌ టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 48 పరుగుల తేడాతో గెలుపొందింది. డేవిడ్ వార్నర్‌ ట్రిపుల్‌ సెంచరీ చేయగా.. నాథన్‌ లయన్‌ (5/69) తన స్పిన్‌ మాయాజాలంతో పాకిస్తాన్‌ను తిప్పేశాడు.

అది నాకు అస్సలు నచ్చలేదు:

అది నాకు అస్సలు నచ్చలేదు:

డే/నైట్‌ టెస్టులో భాగంగా కెప్టెన్ పైన్‌కు చెప్పి స్మిత్‌ ఫీల్డర్ల స్థానాలను మార్చాడు. ఇది ఛాపెల్‌కు నచ్చలేదు. దీంతో స్మిత్‌పై ఇయాన్‌ అసంతృప్తి వ్యక్తం చేసాడు. 'మైదానంలో కొందరు ఫీల్డర్లను స్మిత్‌ను మార్చడం చూశా. పైన్‌తో మాట్లాడి వారిని ఆఫ్‌సైడ్‌ మార్చేందుకు ప్రయత్నించాడు. స్మిత్‌ కోరిక మేరకే పైన్‌ వారిని మార్చాడో లేదో తెలియదు. స్మిత్‌ అలా చేయడం మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఇది పైన్‌ను తక్కువ అంచనా వేయడమే' అని ఛాపెల్‌ అన్నాడు.

పైన్‌ను తక్కువ చేయడం లేదు:

పైన్‌ను తక్కువ చేయడం లేదు:

ఛాపెల్‌ వ్యాఖ్యలపై స్మిత్‌ స్పందించాడు. 'నేనెప్పుడు పైన్‌కు సాయపడేందుకే ప్రయత్నిస్తుంటా. అతడు అద్భుతంగా తన పని చేస్తున్నాడు. నేను అతడికి సలహాలు మాత్రమే ఇస్తా. జట్టు బాగా ఆడాలని నేను కోరుకుంటాను. నేను టిమ్‌ను తక్కువ చేయడం లేదు. అతడిని నేను అగౌరవపరచలేదు' అని స్పష్టం చేశాడు.

 టెస్టు చాంపియన్‌షిప్‌లో రెండో స్థానం:

టెస్టు చాంపియన్‌షిప్‌లో రెండో స్థానం:

డే/నైట్‌ టెస్టులో విజయం సాధించి రెండు టెస్టుల సిరీస్‌ను ఆసీస్‌ 2-0తో కైవసం చేసుకుంది. పింక్‌ బాల్‌ టెస్టుల్లో ఆసీస్‌కు ఇది ఆరో విజయం కాగా.. అందులో నాలుగింటికి అడిలైడ్‌ వేదిక కావడం విశేషం. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఆసీస్‌.. 120 పాయింట్లు ఖాతాలో వేసుకుని 176 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరింది. టీమిండియా (360) టాప్‌లో ఉంది. మరోవైపు రెండు టెస్టులు ఆడిన పాకిస్థాన్‌ ఇంకా ఖాతా తెరువలేదు.

పాక్‌ చెత్త రికార్డు:

పాక్‌ చెత్త రికార్డు:

ఆస్ట్రేలియా పర్యటనలో కనీసం ఒక్క టెస్టు మ్యాచ్‌ను పాక్‌ గెలవకపోవడం గత 20 ఏళ్లలో ఐదోసారి. 1999లో ఆసీస్‌ 3-0తో సిరీస్‌ను గెలవగా.. 2004, 2009, 2016 పర్యటనలో ఆస్ట్రేలియా 3-0తో సిరీస్‌లను కైవసం చేసుకుంది. తాజాగా జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను కూడా ఆసీస్‌ 2-0తో గెలుచుకుంది. పాకిస్తాన్‌ క్రికెట్‌ చరిత్రలో అడిలైడ్‌లో జరిగిన టెస్టులో ఇన్నింగ్స్‌ తేడాతో ఓడిపోవడం రెండోసారి. 1972లో తొలిసారి ఇన్నింగ్స్‌ తేడాతో ఓడిపోయింది.

Story first published: Wednesday, December 4, 2019, 11:59 [IST]
Other articles published on Dec 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+