Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

David Warner:ఇకపై నోరు మూసుకోండి - సెంచరీ తర్వాత వార్నర్ ఘూటు వ్యాఖ్యలు

తన కెరీర్‌లో ఆఖరి టెస్టు సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెలరేగిపోతున్నాడు. పెర్త్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్నతొలి టెస్టు సిరీస్ లో వార్నర్ శతకంతో చెలరేగాడు. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. వార్నర్ ధాటికి తొలి రోజు ఆటలో టీ సమయానికి ఆసీస్ రెండు వికెట్లకు 210 పరుగులు చేసింది.

టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు శుభారంభం లభించింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (114*), ఉస్మాన్ ఖవాజా (41) 126 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఖవాజా నిలకడగా ఆడగా, వార్నర్ బౌండరీలతో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

Australia vs Pakistan: Shut up now - David Warners scathing comments on critics after the century

అయితే ఖవాజాను షాహీన్ అఫ్రిది ఔట్ చేయడంతో 126 పరుగుల వద్ద ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన లబుషేన్ (16) కూడా కొద్దిసేపటికే పెవిలియన్‌కు చేరాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన స్మిత్‌తో కలిసి వార్నర్ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో సెంచరీ సాధించాడు. తన కెరీర్‌లో ఇది 49వ శతకం. టెస్టుల్లో 26వ సెంచరీ.

అయితే టీ బ్రేక్ లో తన సెంచరీపై వార్నర్ మాట్లాడాడు. ''పరుగులు చేయడమే నా బాధ్యత. తొలుత ఖవాజాతో, తర్వాత స్మిత్ తో భాగస్వామ్యాలు నెలకొల్పాను. సెంచరీ సాధించడం గొప్పగా ఉంది. విమర్శకులకు నోరు మూయించడానికి ఇంతకంటే గొప్ప మార్గం లేదు'' అని వార్నర్ అన్నాడు. వార్నర్ ఎంపికపై మిచెల్ జాన్సన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

కాగా, ఆస్ట్రేలియాలో పాకిస్థాన్ చివరిసారిగా 1995లో టెస్టు మ్యాచ్ లో గెలిచింది. ఇప్పటివరకు టెస్టు సిరీస్ ను విజయం సాధించలేకపోయింది. 1999 నుంచి వరుసగా 14 టెస్టుల్లో పాక్ ఓటమిపాలైంది. కనీసం 'డ్రా' కూడా మ్యాచ్ ను ముగించలేకపోయింది.

Story first published: Thursday, December 14, 2023, 13:26 [IST]
Other articles published on Dec 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+