Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Babar Azam: ఔటయ్యానా? అసలు బాల్ ఎప్పుడు వచ్చింది? (వీడియో)

మెల్‌బోర్న్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తుంది. ఓవర్‌నైట్ స్కోరు 187/3తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ 318 పరుగులకు ఆలౌటైంది. లబుషేన్ (63) టాప్ స్కోరర్. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన పాకిస్థాన్ 151 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది.

34 పరుగులకే ఓపెనర్ ఇమాముల్ హక్ (10) ఔటయ్యాడు. అయితే కెప్టెన్ షాన్ మసూద్ (54)తో కలిసి మరో ఓపెనర్ (62) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 90 పరుగులు చేశారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీలు చేశారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా బౌలర్లు పుంజుకుని వరుసగా వికెట్లు తీసి పోటీలోకి వచ్చారు.

Australia vs Pakistan: Pat Cummins gets rid of Babar Azam again with another UNBELIEVABLE BEAUTY

అయితే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బాబర్ అజామ్ ఏడు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. ప్యాట్ కమిన్స్ వేసిన ఇన్ స్వింగర్‌కు బాబర్ దగ్గర సమాధానమే లేదు. క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అనంతరం తన ఔట్‌ను బాబర్ అజామ్ కాసేపు నమ్మలేకపోయాడు. అసలు బాల్ ఎలా వచ్చింది? ఎప్పుడు వచ్చిందంటూ చూస్తూ నిరాశతో క్రీజును వీడాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

గత కొంతకాలంగా బాబర్ అజామ్ పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇటీవల జరిగిన వరల్డ్ కప్ అనంతరం తన కెప్టెన్సీకి అతడు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అన్ని ఫార్మాట్ల నుంచి సారథిగా తప్పుకుంటున్నాని ప్రకటించాడు. కేవలం బ్యాటర్‌గా మాత్రమే జట్టులో కొనసాగుతానని తెలిపాడు. కానీ పరుగులు సాధించడంలో విఫలమవుతున్నాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 35 పరుగులే చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 21 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 14 పరుగులు తీశాడు. క్రీజులో ఎక్కువ సేపు కూడా నిలవలేకపోతున్నాడు. దీంతో నెట్టింట్లో బాబర్ అజామ్‌ విపరీతంగా ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు.

Story first published: Wednesday, December 27, 2023, 12:25 [IST]
Other articles published on Dec 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+