Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఛీ ఛీ.. ఇంత దారుణమా! పాకిస్థాన్ ఎప్పటికీ మారదు (వీడియో)

పాకిస్థాన్ ఫీల్డింగ్‌ ఎప్పటికీ మారదని మరోసారి రుజువైంది. చెత్త ఫీల్డింగ్‌తో బౌలర్ల కష్టానికి విలువ లేకుండా పోతుంది. బౌలర్ల చలవతో అతికష్టంగా మ్యాచ్‌‌లో పాకిస్థాన్ కాస్త పైచేయి సాధించింది. కానీ సులువైన క్యాచ్‌లను జారవిడుస్తూ మరోసారి మ్యాచ్‌ను చేజార్చుకుంటుంది.

మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ పేలవ ఫీల్డింగ్ చేస్తోంది. అబ్దుల్లా షఫీకి ఏకంగా ఈ మ్యాచ్‌లో మూడు క్యాచ్‌లను నేలపాలు చేయడం గమనార్హం. అది కూడా అత్యంత సులువైన క్యాచ్‌లు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 318 పరుగులు చేయగా, పాకిస్థాన్ 264 పరుగులకు ఆలౌటైంది.

Australia vs Pakistan: Pakistan team fielding never changes. Its worst forever

అయితే ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ బౌలర్లు చెలరేగారు. షాహీన్ అఫ్రిది, హంజా చెరో రెండు వికెట్లతో సత్తాచాటడంతో 16 పరుగులకే ఆసీస్ నాలుగు వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ పాకిస్థాన్ వైపు తిరిగింది. కానీ కాసేపటికే మిచెల్ మార్ష్ ఔట్ చేసే అవకాశాన్ని పాక్ కోల్పోయింది. జమాల్ వేసిన బంతి మార్ష్ బ్యాట్‌కు ఎడ్జ్ తీసుకుంది. స్లిప్‌లో ఉన్న షఫికి చేతుల్లో నేరుగా పడింది. కానీ సులువైన క్యాచ్‌ను అతడు అందుకోలేకపోయాడు.

20 పరుగుల వ్యక్తిగత స్కోరు లైఫ్ పొందిన మార్ష్ (83*) ఆ తర్వాత విజృంభించాడు. స్మిత్‌(45*) తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సెంచరీ దిశగా సాగుతున్నాడు. అయితే పాకిస్థాన్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 52 పరుగులు ఎక్స్‌ట్రా రూపంలోనే ఇచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఆధిక్యత 54 పరుగులు. ఆ అదనపు పరుగులను కంట్రోల్ చేసుకొని ఉంటే పాకిస్థాన్ మ్యాచ్‌లో పట్టు బిగించేది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 200 పరుగులకు పైగా ఆధిక్యంలో ఉంది.

Story first published: Thursday, December 28, 2023, 12:07 [IST]
Other articles published on Dec 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+