For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత క్యాబ్‌ డ్రైవర్‌కు పాక్‌ క్రికెటర్ల విందు.. ఎందుకో తెలుసా!!

Australia vs Pakistan: Pakistan cricketers treat India taxi driver to dinner after he refuses to take money

బ్రిస్బేన్‌: ఓ భారత క్యాబ్‌ డ్రైవర్‌కు ఐదుగురు పాకిస్థాన్‌ క్రికెటర్లు విందు ఇచ్చారు. దీంతో ఆదివారం రాత్రి అతడికి జీవితంలో మరచిపోలేనిది అయింది. పాకిస్థాన్ ప్రస్తుతం ఆసీస్‌లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. బ్రిస్బేన్‌లో జరిగిన తొలి టెస్టులో పాక్ ఓటమి పాలైన విషయం తెలిసిందే.

డబ్బులు తీసుకోలేదు

డబ్బులు తీసుకోలేదు

మ్యాచ్ అనంతరం బ్రిస్బేన్‌ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ నుంచి ఐదుగురు పాక్‌ ఆటగాళ్లు ఓ క్యాబ్‌ను భారత రెస్టారెంట్‌కు బుక్‌ చేసుకున్నారు. హోటల్‌ వద్దకు వెళ్లాక క్యాబ్‌ డ్రైవర్‌కు తెలిసింది వారు సాధారణ ప్రయాణికులు కాదని. ఇండియన్‌ రెస్టారెంట్‌ దగ్గర దింపాక పాక్ ఆటగాళ్లు డబ్బులు ఇవ్వబోగా డ్రైవర్‌ నిరాకరించాడు. ఆ క్యాబ్‌ డ్రైవర్‌ వారిపై గౌరవంతో డబ్బు తీసుకోలేదు.

డ్రైవర్‌కు పాక్‌ క్రికెటర్ల విందు:

దీంతో పాక్ ఆటగాళ్లు షాహిన్‌ షా, యాసిర్‌ షా, నసీమ్‌ షాలతో పాటు మరో ఇద్దరు ఆ డ్రైవర్‌ను తమ వెంట రెస్టారెంట్‌కు తీసుకెళ్లి విందు ఇచ్చారు. ఈ విషయాన్ని ఏబీసీ రేడియో ప్రెజెంటర్‌ అలీసన్‌ మిచెల్‌.. ఆస్ట్రేలియా మాజీ పేస్‌ బౌలర్‌ మిచెల్‌ జాన్సన్‌కు లైవ్‌లో తెలియజేసింది. అలిసన్‌ మిచెల్‌కు ఈ విషయాన్ని స్వయంగా ఆ క్యాబ్‌ డ్రైవరే చెప్పాడట.

పాక్ ఆటగాళ్లపై ప్రశంసలు:

పాక్ ఆటగాళ్లపై ప్రశంసలు:

అలిసన్‌ మిచెల్‌ కూడా అదే క్యాబ్‌లో భారత్‌-పాకిస్థాన్‌ టెస్టు మ్యాచ్‌ సందర్భంగా స్టేడియానికి వస్తుంటే డ్రైవర్‌ తన సంతోషాన్ని తనతో పంచుకున్నాడని చెప్పింది. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ప్రస్తుతం ఆసీస్‌-పాక్‌ దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్న సమయంలో పాక్ ఆటగాళ్ల తీరు అందరి మన్ననలు అందుకుంటోంది.

ఆసీస్‌ ఘన విజయం:

ఆసీస్‌ ఘన విజయం:

ఆదివారం పూర్తైన తొలి టెస్టులో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. కంగారూ పేసర్లు హజిల్‌వుడ్ (4/63), స్టార్క్ (3/73), కమిన్స్ (2/69) ధాటికి పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 335 పరుగులకు ఆలౌటైంది. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 240 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 580 పరుగులు చేసిన విషయం తెలిసిందే. రెండో టెస్టు డే/నైట్‌ కాగా శుక్రవారం ఆడిలేడ్‌లో జరగనుంది.

Story first published: Tuesday, November 26, 2019, 9:55 [IST]
Other articles published on Nov 26, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+