న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇమామ్‌ టెస్టు కెరీర్‌ పరుగుల కన్నా.. వార్నర్‌ రెండు ఇన్నింగ్స్‌ల పరుగులే ఎక్కువ!!

Australia vs Pakistan: Imam Ul Haq Trolled By Iceland Cricket Board After Failure In 2nd Test

అడిలైడ్‌: పాకిస్తాన్‌తో ముగిసిన రెండో (డే/నైట్‌) టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ (335 నాటౌట్‌; 418 బంతుల్లో 39x4, 1x6) ట్రిపుల్‌ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో మిచెల్‌ స్టార్క్‌ (7), నాథన్ లియోన్ (5) చెలరేగారు. తొలి ఇన్నింగ్స్‌లో స్టార్క్‌.. రెండో ఇన్నింగ్స్‌లో లియోన్ పాక్ పనిపెట్టారు.

సెలక్షన్ కమిటీ గడువు ముగిసింది.. ఇక వారు కొనసాగలేరు: దాదాసెలక్షన్ కమిటీ గడువు ముగిసింది.. ఇక వారు కొనసాగలేరు: దాదా

పాక్‌ క్రికెటర్‌ను ట్రోల్‌ చేసిన ఐస్‌లాండ్‌:

పాక్‌ క్రికెటర్‌ను ట్రోల్‌ చేసిన ఐస్‌లాండ్‌:

ఈ టెస్టులో ఘోరంగా విఫలమైన పాకిస్తాన్‌ ఓపెనర్‌ ఇమాముల్‌ హక్‌ను ఐస్‌లాండ్‌ క్రికెట్‌ బోర్డు ట్రోల్‌ చేసింది. రెండో టెస్టులో హారిస్‌ సోహైల్‌ను పక్కనపెట్టి ఇమామ్‌కు చోటిచ్చింది పాక్‌. తొలి ఇన్నింగ్స్‌లో రెండు పరుగులే చేసి స్టార్క్‌ బౌలింగ్‌లో పెవిలియన్ చేరిన ఇమామ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో డకౌటయ్యాడు. దీంతో పాక్ అభిమానులు సోషల్‌ మీడియాలో ఇమామ్‌ను ఓ ఆటాడుకుంటున్నారు.

 వార్నర్‌ రెండు ఇన్నింగ్స్‌ల పరుగులే ఎక్కువ:

వార్నర్‌ రెండు ఇన్నింగ్స్‌ల పరుగులే ఎక్కువ:

ఐస్‌లాండ్‌ క్రికెట్‌ బోర్డు కూడా తమ అధికారిక ట్విటర్‌లో ఇమామ్‌ను ట్రోల్ చేసింది. 'ఇమామ్‌ తన టెస్టు కెరీర్‌లో మొత్తం చేసిన పరుగుల కన్నా.. వార్నర్‌ గత రెండు ఇన్నింగ్స్‌ల్లో చేసిన పరుగులే ఎక్కువ' అని రాసుకొచ్చింది. ఇమామ్‌ 11 టెస్టు మ్యాచ్‌లలో 21 ఇన్నింగ్స్‌లు ఆడి 485 పరుగులు చేశాడు. వార్నర్‌ రెండు టెస్టులకు గాను రెండు ఇన్నింగ్స్‌లు ఆడి 489 పరుగులు చేశాడు. బ్రిస్బేన్‌లో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (154) చేస్తే.. ఇక రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ట్రిపుల్‌ సెంచరీ (335) చేశాడు.

వార్నర్‌ ట్రిపుల్‌ సెంచరీ:

వార్నర్‌ ట్రిపుల్‌ సెంచరీ:

రెండో టెస్టు టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 48 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 39/3తో సోమవారం నాలుగో రోజు ఆట కొనసాగించిన పాకిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 239 పరుగుల వద్ద ఆలౌటైంది. షాన్ మసూద్ (68), అసద్ షఫీక్ (57), మహ్మద్ రిజ్వాన్ (45) పరుగులు చేశారు. నాథన్ లియోన్ ఐదు వికెట్లు తీసాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 94.4 ఓవర్లలో 302 పరుగుల వద్ద ఆలౌటైంది. యాసిర్‌ షా (213 బంతుల్లో 113; 13 ఫోర్లు) సెంచరీ చేసాడు. ఆస్ట్రేలియా 589/3 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే. వార్నర్‌ ట్రిపుల్‌ సెంచరీ సాధించాడు.

 13 ఏళ్ల తర్వాత:

13 ఏళ్ల తర్వాత:

13 ఏళ్ల తర్వాత పాక్‌ తరఫున నంబర్‌ 8లో వచ్చిన బ్యాట్స్‌మన్‌ (యాసిర్‌ షా) సెంచరీ చేశాడు. చివరిసారి 2006 కరాచీలో భారత్‌తో టెస్టులో కమ్రాన్‌ అక్మల్‌ (113) ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా పాక్‌ తరఫున తొమ్మిది మంది నంబర్‌ 8లో వచ్చి సెంచరీలు చేశారు.

Story first published: Monday, December 2, 2019, 15:40 [IST]
Other articles published on Dec 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X