For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

David Warner: రిటైర్మెంట్ తర్వాత వార్నర్ కొత్త అవతారం.. క్రేజీ న్యూస్ అంటూ ఫ్యాన్స్ హ్యాపీ!

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టులకు, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. సిడ్నీ వేదికగా పాకిస్థాన్‌తో తన కెరీర్‌లో ఆఖరి టెస్టు ఆడుతున్నాడు. అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సాల్మన్ బౌలింగ్‌లో వార్నర్ 34 పరుగుల వద్ద ఔటయ్యాడు. వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలగడంతో రెండో రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది.

పాకిస్థాన్ కంటే ఆస్ట్రేలియా ఇంకా 197 పరుగుల వెనుకంజలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 313 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. కష్టాల్లో ఉన్న పాక్‌ను మహమ్మద్ రిజ్వాన్ (88), అమిర్ జమాల్ (82) ఆదుకున్నారు. కాస్త దూకుడుగా ఆడుతూ స్కోరును సాధించారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ అయిదు వికెట్లతో సత్తాచాటాడు.

Australia vs Pakistan: David Warner will be a commentator in the upcoming Border Gavaskar Trophy.

అయితే రిటైర్మెంట్ అనంతరం డేవిడ్ వార్నర్ వ్యాఖ్యాతగా అవతారమెత్తనున్నాడు. ఈ ఏడాది ఆఖర్లో జరిగే భారత్-ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వార్నర్ కామెంటరీ చేయనున్నాడు. నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. 2025 జనవరి వరకు సాగే ఈ సుదీర్ఘ పర్యటనలో కామెంటేటర్‌గా వార్నర్ భాగమవ్వడం హ్యాపీ న్యూస్ అని తన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కుదిరితే వార్నర్ కామెంటరీలో తెలుగు సాంగ్స్ పాడాలని సరదాగా కోరుతున్నారు.

అయితే టెస్టులు, వన్డేలకు రిటైర్మెంట్ ఇచ్చిన వార్నర్ టీ20లకు అందుబాటులో ఉంటాడు. అంతేకాకుండా ప్రాంఛైజీ లీగుల్లోనూ పాల్గొంటాడు. ఐపీఎల్‌లో వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, 112 టెస్టులు ఆడిన వార్నర్ ఇప్పటివరకు 8729 పరుగులు చేశాడు. ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 34 పరుగులకే ఔటైనా వార్నర్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరోవైపు వన్డేల్లో ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్‌‌గా డేవిడ్ వార్నర్ నిలిచాడు. 161 మ్యాచ్‌ల్లో 45 సగటుతో 6932 పరుగులు చేశాడు. అలాగే అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన రెండో ఆసీస్ ప్లేయర్‌గా వార్నర్ నిలిచాడు. వన్డేల్లో రికీ పాంటింగ్ 29 సెంచరీలు సాధించగా, వార్నర్ 22 శతకాలు సాధించాడు.

Story first published: Thursday, January 4, 2024, 13:44 [IST]
Other articles published on Jan 4, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+