న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఏదోరోజు లారా 400 పరుగుల రికార్డును బద్దలు కొడతా: వార్నర్‌

Australia vs Pakistan: David Warner hopes to knock off Brian Laras 400 one day

అడిలైడ్‌: ఏదోరోజు వెస్టిండీస్‌ దిగ్గజం బ్రయన్‌ లారా 400 పరుగుల రికార్డును బద్దలు కొడతా అని ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ధీమా వ్యక్తం చేశాడు. ట్రిపుల్ సెంచరీ చేసిన తనను లారా స్వయంగా కలిసి అభినందించడం గొప్ప అనుభూతి అని వార్నర్‌ పేర్కొన్నాడు. అడిలైడ్‌ వేదికగా పాకిస్తాన్‌తో ముగిసిన డే/నైట్ టెస్టులో వార్నర్‌ (335 నాటౌట్‌; 418 బంతుల్లో 39x4, 1x6) ట్రిపుల్‌ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వార్నర్ ట్రిపుల్‌ సెంచరీ చేయడంతో ఆసీస్ 589/3 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం రెండు ఇన్నింగ్స్‌లలో పాక్ ఆలౌట్ అయి ఇన్నింగ్స్‌ 48 పరుగుల తేడాతో ఓడిపోయింది.

కపిల్‌దేవ్‌ పునాది వేస్తే.. కోహ్లీ నిర్మించాడు!!కపిల్‌దేవ్‌ పునాది వేస్తే.. కోహ్లీ నిర్మించాడు!!

నాకు ఆ అవకాశం మళ్లీ వస్తుంది:

నాకు ఆ అవకాశం మళ్లీ వస్తుంది:

వార్నర్ ట్రిపుల్‌ సెంచరీ అనంతరం లారా మాట్లాడుతూ... 'ప్రస్తుతం నేను అడిలైడ్‌లోనే ఉన్నా. వార్నర్‌ను కలిసి అభినందనలు తెలియజేస్తా అని అన్నాడు. అన్నట్టుగానే వార్నర్‌ను లారా స్వయంగా కలిసి అభినందనలు తెలియజేశాడు. ఈ సందర్భంగా లారాతో కలిసి తీసుకున్న ఓ ఫొటోను వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. 'దిగ్గజ ఆటగాడు స్వయంగా నన్ను కలవడం గొప్ప అనుభూతి. ఏదో ఓరోజు లారా 400 పరుగుల రికార్డును అధిగమించే అవకాశం నాకు మళ్లీ వస్తుంది' అని రాసుకొచ్చాడు.

నా రికార్డును అధిగమిస్తాడనుకున్నా:

నా రికార్డును అధిగమిస్తాడనుకున్నా:

తాజాగా లారా మాట్లాడుతూ... 'వార్నర్‌ నా రికార్డును దాటేస్తాడని భావించా. నా రికార్డును అందుకొనేందుకు అతడికి అనుమతి ఇస్తారనుకున్నా. కానీ అతనికి ఆ అవకాశం రాలేదు. నేను సోబర్స్‌ ఘనతను దాటేసినప్పుడు అద్భుతంగా అనిపించింది. రికార్డులు బద్దలు కొట్టడానికే. దూకుడైన ఆటగాళ్లు రికార్డులు బద్దలు కొడితే గొప్పగా ఉంటుంది' అని అన్నాడు.

వార్నర్‌కు మరో అవకాశం లభిస్తుంది:

వార్నర్‌కు మరో అవకాశం లభిస్తుంది:

'ప్రస్తుతం నేను అడిలైడ్‌లోనే ఉన్నా. వార్నర్‌ను కలిసి అభినందనలు తెలియజేస్తా. అతడు ఎప్పుడో ఓ సారి ఆడే వ్యక్తికాదు. నిలకడగా రాణించే దూకుడైన బ్యాట్స్‌మన్‌. వార్నర్‌కు మరో అవకాశం లభిస్తుంది. అప్పుడు 400 పరుగులు తప్పక సాధిస్తాడని అనుకుంటున్నా. ఎందుకంటే.. 300 పరుగులు చేసిన వాడికి 400 చేయడమెలాగో తెలుసు. ఇలాంటి అవకాశం మళ్లీ అతనికి రావాలనుకుంటున్నా' అని లారా పేర్కొన్నారు.

 బ్రాడ్‌మన్‌ రికార్డు బద్దలు:

బ్రాడ్‌మన్‌ రికార్డు బద్దలు:

1994లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచులో గ్యారీ సోబర్స్‌ (365) అత్యధిక వ్యక్తిగత టెస్ట్ పరుగుల రికార్డును లారా (375) బద్దలు కొట్టాడు. మళ్లీ 2004లో లారా 400 పరుగులు చేశాడు. అడిలైడ్‌ వేదికగా పాక్‌తో జరిగిన టెస్టులో వార్నర్‌ 335 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. లారా 400 పరుగుల రికార్డును వార్నర్ అధిగమిస్తాడని అందరూ భావించినా.. ఆసీస్ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయడంతో అది సాధ్యపడలేదు. అయితే బ్రాడ్‌మన్‌ (334) రికార్డును మాత్రం బద్దలు కొట్టాడు.

Story first published: Wednesday, December 4, 2019, 16:22 [IST]
Other articles published on Dec 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X