Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Australia vs Pakistan: డేవిడ్ వార్నర్ డబుల్ సెంచరీ, భారీ స్కోరు దిశగా ఆసీస్

Australia vs Pakistan: David Warner hits 2nd double hundred as Pakistan fall away

హైదరాబాద్: అడిలైడ్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న డే నైట్ టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. 302/1 ఓవర్‌ నైట్‌ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్ డబుల్ సెంచరీతో భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.

మ్యాచ్ ఆరంభమైన తర్వాత జట్టు స్కోరు 369 పరుగుల వద్ద మార్నస్ లాబుస్చాగ్నే(162)ను రెండో వికెట్‌గా ఆస్ట్రేలియా కోల్పోయినప్పటికీ డేవిడ్ వార్నర్ మాత్రం మరింత దూకుడుగా ఆడాడు. తొలి రోజు ఆటలో సెంచరీ పూర్తి చేసుకున్న డేవిడ్ వార్నర్‌ రెండో రోజు దానిని డబుల్ సెంచరీగా మలిచాడు.

అఫ్రిది వేసిన బంతిని

అఫ్రిది వేసిన బంతిని

షాహీన్ అఫ్రిది వేసిన బంతిని షార్ట్ ఫైన్ లెగ్ వైపుకు ఒక పరుగుగా తరలించి డేవిడ్ వార్నర్ డబుల్ సెంచరీ మార్కుని అందుకున్నాడు. టెస్టుల్లో వార్నర్‌కి ఇది రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. అంతకముందు ముహమ్మద్ మూసా బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ క్యాచ్ ఇచ్చినా... అది నోబాల్‌ కావడంతో వార్నర్ బ్రతికిపోయాడు.

ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా లాబుస్చాగ్నే

ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా లాబుస్చాగ్నే

అంతకుముందు, మార్నస్ లాబుస్చాగ్నే 2019లో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఏడాది ఇప్పటివరకు లాబుస్చాగ్నే 829 పరుగులు చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో వీరిద్దరి జోడి రెండో వికెట్‌కు 361 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అడిలైడ్ ఓవల్‌లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.

జో బర్న్స్‌ తొలి వికెట్‌గా

జో బర్న్స్‌ తొలి వికెట్‌గా

జో బర్న్స్‌ తొలి వికెట్‌గా ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన లాబుస్చాగ్నే.. వార్నర్‌కు చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కూడా వీరిద్దరూ సెంచరీలతో మెరిసిన సంగతి తెలిసిందే. రెండో టెస్టులోనూ వీరు తమ జోరుని కొనసాగించడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతోంది.

స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ

స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ

లాబుస్చాగ్నే ఔటైన తర్వాత క్రీజులోకి స్టీవ్ స్మిత్ వచ్చాడు. ప్రస్తుతం టీ విరామానికి ఆస్ట్రేలియా 108 ఓవర్లకు గాను 2 వికెట్లు కోల్పోయి 475 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్ వార్నర్(261) ట్రిపుల్ సెంచరీకి చేరువ కాగా... స్టీవ్ స్మిత్(59) హాఫ్ సెంచరీని సాధించాడు.

Story first published: Saturday, November 30, 2019, 12:01 [IST]
Other articles published on Nov 30, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+