Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs PAK: రేలంగి మావయ్య అంత మంచోడు మన డేవిడ్ వార్నర్ (వీడియో)

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ తన కెరీర్‌లో చివరి టెస్టు సిరీస్ ఆడుతున్నాడు. ప్రస్తుతం పాకిస్థాన్‌తో జరుగుతున్న సిరీస్ అనంతరం అతడు టెస్టు ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పనున్నాడు. ఈ నేపథ్యంలో మెల్‌బోర్న్ స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులు వార్నర్‌కు ఫేర్‌వెల్ తెలుపుతున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో ఔటైన అనంతరం అతడు మైదానాన్ని వీడుతున్న సమయంలో అందరూ లేచి నిలబడి క్లాప్స్ కొట్టారు.

డేవిడ్ వార్నర్ కూడా అందరికీ అభివాదం చేస్తూ థ్యాంక్స్ చెబుతూ ఎమోషనల్‌గా మైదానాన్ని వీడాడు. ఈ క్రమంలో వార్నర్ చేసిన ఓ పని నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరోసారి అందరి మనసులు గెలుచుకున్నావంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రేలంగి మావయ్య అంత మంచోడు మన వార్నర్ అంటూ కొనియాడుతున్నారు. ఇంతకీ వార్నర్ ఏం చేశాడంటే.. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే మార్గంలో వార్నర్‌తో మాట్లాడానికి ఓ కుర్రాడు ప్రయత్నించాడు.

Australia vs Pakistan: David Warner gave his gloves to a kid, a beautiful moment!

ఇది గమనించిన వార్నర్ ఆ కుర్రాడికి ఓ గిఫ్ట్ ఇచ్చాడు. తన గ్లవ్స్‌ను ఇచ్చేసి వెళ్లిపోయాడు. గ్లవ్స్ అందుకున్న అనంతర ఆ కుర్రాడు ఆనందంతో గంతులు వేశాడు. ఇది నిజమేనా అన్నట్లు‌గా రియాక్ట్ అయ్యాడు. తర్వాత ఇతర ప్రేక్షకులకు గ్లవ్స్ చూపించి సంబర పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

మూడో రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. 241 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.16 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆ జట్టును మిచెల్ మార్ష్ (96), స్టీవ్ స్మిత్ (50) ఆదుకున్నారు. వీరిద్దరు అయిదో వికెట్‌కు 153 పరుగులు జోడించారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, హంజా చెరో మూడు వికెట్లు తీశారు.

ఇక వార్నర్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు పరుగులే చేశాడు. జనవరి 3న సిడ్నీ వేదికగా జరగనున్న ఆసీస్-పాక్ మూడో టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్ కెరీర్‌ను ముగించనున్నాడు.

Story first published: Thursday, December 28, 2023, 17:22 [IST]
Other articles published on Dec 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+