అడిలైడ్‌లో పింక్ బాల్ టెస్ట్: వార్నర్ ట్రిపుల్ సెంచరీ, తొలి ఇన్నింగ్స్ 589-3 డిక్లేర్

హైదరాబాద్: అడిలైడ్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న డే నైట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌ను 589/3 వద్ద డిక్లేర్డ్ చేసింది. ఫలితంగా డే నైట్ టెస్టు చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును తాజాగా ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే పాక్ అత్యధిక స్కోరును ఆస్ట్రేలియా అధిగమించింది.
2016లో వెస్టిండీస్‌తో జరిగిన డే నైట్ టెస్టులో పాక్ మూడు వికెట్ల నష్టానికి 579 పరుగులు సాధించింది. ఇప్పుడు ఆ రికార్డుని ఆస్ట్రేలియా బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (335 నాటౌట్; 418 బంతుల్లో 39 ఫోర్లు, సిక్స్) ట్రిపుల్ సెంచరీకి తోడు లబూషేన్(162; 238 బంతుల్లో 22 ఫోర్లు) సెంచరీ సాధించడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది.
పాకిస్థాన్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 3 వికెట్లు పడగొట్టాడు. 302/1 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్ రికార్డులే లక్ష్యంగా సాగింది. డేవిడ్ వార్నర్ 389 బంతుల్లో 37 బౌండరీల సాయంతో ట్రిపుల్ సెంచరీ సాధించడంతో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
వార్నర్‌కి ఇదే తొలి ట్రిపుల్ సెంచరీ
టెస్టుల్లో వార్నర్‌కి ఇదే తొలి ట్రిపుల్ సెంచరీ. ఆసీస్ తరుపున ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏడో బ్యాట్స్‌మన్‌గా వార్నర్ నిలిచాడు. అడిలైడ్ ఓవల్ పిచ్‌పై ఓ ప్లేయర్ ట్రిపుల్ సెంచరీ చేయడం ఇదే మొదటిసారి. ఫలితంగా ఈ స్టేడియంలో ఇప్పటివరకు డాన్ బ్రాడ్‌మన్(299) పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డు కనుమరుగైంది.
2012 తర్వాత ఆస్ట్రేలియా తరుపున
2012 తర్వాత ఆస్ట్రేలియా తరుపున ట్రిపుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ నిలిచాడు. 2012, జనవరిలో టీమిండియాతో జరిగిన ఓ టెస్టులో మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్(329 నాటౌట్) ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు డేవిడ్ వార్నర్ ఆసీస్ తరుపున ట్రిపుల్ సెంచరీ సాధించాడు.
టెస్టు క్రికెట్ చరిత్రలో
టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా చేసిన నాలుగో ట్రిపుల్ సెంచరీ ఇది. ఈ జాబితాలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(278 balls vs South Africa, 2007-08) అగ్రస్థానంలో ఉన్నాడు. మ్యాథ్యూ హెడెన్(362 balls vs Zimbabwe, 2003-04) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
పాక్ కెప్టెన్ అజహర్ అలీ రికార్డు బద్దలు
మళ్లీ సెహ్వాగే(364 balls vs Pakistan, 2003-04) మూడో స్థానంలో ఉన్నాడు. దీంతో పాటు డే నైట్ టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డుని డేవిడ్ వార్నర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో పాక్ కెప్టెన్ అజహర్ అలీ నమోదు చేసిన 302 వ్యక్తిగత పరుగుల రికార్డును డేవిడ్ వార్నర్ బద్దలు కొట్టాడు.
స్టీవ్ స్మిత్ అత్యంత వేగంగా 7000 పరుగులు
మరోవైపు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో 7000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. పాక్ బౌలర్ మహ్మద్ ముసా బౌలింగ్‌లో సింగిల్ తీయడం ద్వారా స్మిత్ ఈ ఘనత సాధించాడు. అయితే, టెస్టుల్లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న రికార్డుని ఆటగాడిగా స్టీవ్ స్మిత్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
తొలి వికెట్ కోల్పోయిన పాకిస్థాన్
కాగా, డే నైట్ టెస్టులో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన కొద్దిసేపటికే ఇమాముల్ హక్(2) వికెట్‌ను కోల్పోయింది. మిచెల్ స్టార్క్ వేసిన ఐదో ఓవర్ మూడో బంతికి వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఇమాముల్(2) పరుగుల వద్ద వెనుదిరిగాడు. దీంతో జట్టు స్కోరు 3 పరుగులకే వికెట్ కోల్పోయి పాక్ కష్టాల్లో పడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications