For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

AUS vs PAK: పాక్ టీమ్‌లో మాక్స్‌వెల్.. సేమ్ టు సేమ్ బాదేశాడు! (వీడియో)

ఆస్ట్రేలియా పర్యటనలో చివరి టెస్టు ఆడుతున్న పాకిస్థాన్ సత్తాచాటుతోంది. ఆసీస్ గడ్డపై టెస్టు గెలవాలనే 28 ఏళ్ల కల కోసం తీవ్రంగా పోరాడుతోంది. సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 313 పరుగులకు ఆలౌటైంది. అయితే పాకిస్థాన్ పేలవ ఆరంభానికి పాక్ 300 మార్క్‌ను దాటిందంటే మహమ్మద్ రిజ్వాన్ (88; 103 బంతుల్లో), అమీర్ జమాల్ (82; 97 బంతుల్లో) గొప్ప పోరాటమే.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఖాతా తెరవకుండానే ఓపెనర్లు అబ్దుల్లా షఫికి, సయిమ్ అయుబ్ పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత వచ్చిన బాబర్ అజామ్ (26) , సౌద్ షకీల్ (5) కూడా విఫలమవ్వడంతో 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రిజ్వాన్ ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డు పెంచాడు. అయితే సెంచరీ దిశగా సాగుతున్న అతడిని కమిన్స్ ఔట్ చేశాడు.

Australia vs Pakistan: Another Glenn Maxwell in Pakistan team. Aamer Jamal Hits same to same six in reverse sweep as maxwell

రిజ్వాన్ ఔటైన సమయానికి పాక్ స్కోరు 190/6గా ఉంది. అయితే ఆ తర్వాత ఆసీస్ క్రమం తప్పకుండా వికెట్లు తీసి పాకిస్థాన్‌ను 227/9 స్కోరుకు పరిమితం చేసింది. కానీ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అమీర్ జమాల్ అద్భుతంగా ఆడాడు. పరిపూర్ణ బ్యాటర్‌గా చెలరేగాడు. ఏకంగా తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదాడు.

నాథన్ లయాన్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌తో జమాల్ సిక్సర్ బాదడం ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. ఆ షాట్‌ను చూస్తుంటే మాక్స్‌వెల్ గుర్తొస్తున్నాడని, పాకిస్థాన్ టీమ్‌లో మాక్సీ ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కాగా, పాకిస్థాన్ ఆలౌటైన అనంతరం తొలి రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా ఓవర్ పాటు మాత్రమే బ్యాటింగ్ చేసింది. కెరీర్‌లో తన చివరి టెస్టు ఆడుతున్న వార్నర్ (6)తో పాటు ఖవాజా క్రీజులో ఉన్నాడు.

Story first published: Wednesday, January 3, 2024, 15:29 [IST]
Other articles published on Jan 3, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+