
తొలి బంతికే మిచెల్ స్టార్క్
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మొహమ్మద్ రిజ్వాన్‌ను తాను ఎదుర్కొన్న తొలి బంతికే మిచెల్ స్టార్క్ పెవిలియన్‌కు చేర్చడం విశేషం. అయితే, ఓ అద్భుతమైన ఇన్ స్వింగర్‌కు రిజ్వాన్‌ను స్టార్క్ డకౌట్‌గా ఔట్ చేశాడు. దీంతో 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పాకిస్థాన్ కష్టాల్లో పడింది.

వీడియో సోషల్ మీడియాలో వైరల్
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మిచెల్ స్టార్క్ మిరాకల్ డెలివరీపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఓ నెటిజన్ మిచెల్ స్టార్క్‌ను "కింగ్స్ ఆఫ్ యార్కర్స్" అంటూ కొనియాడాడు. స్టార్క్ చేతి నుంచి వెలువడిన ఓ అద్భుతమైన బంతి అంటూ మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు.
ఆసీస్ విజయ లక్ష్యం 107
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. పాక్ జట్టులో ఇఫ్తికార్ అహ్మాద్(45) టాస్ స్కోరర్‌కాగా మిగతా బ్యాట్స్‌మెన్ నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కేన్ రిచర్డ్‌సన్ మూడు వికెట్లు తీయగా... స్టార్క్, అబ్బాట్ చెరో రెండు వికెట్లు తీశారు. ఆష్టన్ అగర్ ఒక వికెట్ తీశాడు.


Click it and Unblock the Notifications












