Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాక్‌తో డే నైట్ టెస్టు: 'rock-paper-scissors' గేమ్ ఆడిన ఆసీస్ ఓపెనర్లు(వీడియో)

Australia vs Pakistan 2nd Test: David Warner, Joe Burns kill time playing rock-paper-scissors

హైదరాబాద్: పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య డే నైట్ టెస్టుగా జరుగుతున్న రెండో టెస్టు శుక్రవారం ప్రారంభమైంది. వరుణుడు అంతరాయం కలిగించడంతో ఆలస్యంగా ప్రారంభమైంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, వర్షం కారణంగా మ్యాచ్ 15 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్-జో బర్న్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో 'rock-paper-scissors' గేమ్ ఆడుతూ సందడి చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియోని క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ "ఓల్డ్ రాక్ మంచిది, దానిని ఏదీ బీట్ చేయలేదు" అంటూ కామెంట్ పెట్టింది. 'rock-paper-scissors' అనేది చేతులతో ఆడే గేమ్. ఈ గేమ్ ఆడేందుకు ఇద్దరు మనుషుులు చాలు. ఈ గేమ్‌లో ప్రతి క్రీడాకారుడు ఒకేసారి మూడు షేప్స్‌లో ఒకదాన్ని విస్తరించిన చేతితో ఏర్పరుస్తాడు.

ఆ మూడు షేప్స్ ఏంటంటే రాక్, పేపర్, కత్తెర. ఇదిలా ఉంటే ఆసీస్-పాక్ జట్ల మధ్య జరుగుతున్న డే నైట్ టెస్టుకు వరుణుడు అంతరాయం కలిగిస్తున్నాడు. తొలి సెషన్‌లో వర్షంతో మ్యాచ్ నిలిచిన సమయానికి ఆస్ట్రేలియా ఒక వికెట్ కోల్పోయి 70 పరుగులు చేసింది. ఓపెనర్ జో బర్న్స్(4) వద్ద షహీన్ అఫ్రిది బౌలింగ్‌లో మహ్మద్ రిజ్వాన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన మార్నస్ లాబుస్చాగ్నేతో కలిసి ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్కోరు బోర్డుని నడిపిస్తున్నాడు. డిన్నర్ సమయానికి 40 ఓవర్లకు గాను ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 139 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్ వార్నర్(72), మార్నస్ లాబుస్చాగ్నే(60) హాఫ్ సెంచరీలతో ఉన్నారు.

Story first published: Friday, November 29, 2019, 15:36 [IST]
Other articles published on Nov 29, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+