వార్నర్ సూపర్ త్రో.. తల బాదుకున్న బాబర్ అజామ్ (వీడియో)!!

కాన్‌బెర్రా: మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (51 బంతుల్లో 80 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకంతో అదరగొట్టడంతో కాన్‌బెర్రా వేదికగా మంగళవారం పాకిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. స్మిత్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ విజయం సాధించే వరకు క్రీజులో ఉండి పోరాడాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో ఉంది. తొలి టీ20 వర్షంతో రద్దవగా.. ఆఖరి మ్యాచ్ 8న పెర్త్‌లో జరుగుతుంది.
ఆజమ్ మెరుపులు:
ఈ టీ20లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అద్భుత ఫీల్డింగ్ చేసాడు. వార్నర్ సూపర్ త్రోకు పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్, కెప్టెన్ బాబర్ అజామ్ బలయ్యాడు. మొదటగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ పకార్ జమాన్ (2), హరీస్ సోహైల్ (6), మహ్మద్ రిజ్వాన్ (14), ఆసిఫ్ అలీ (4)లు తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. మరో ఓపెనర్ బాబర్ ఆజమ్ (38 బంతుల్లో 50; 6 ఫోర్లు) మెరుపులు మెరిపించాడు.
వార్నర్ సూపర్ త్రో:
ఇఫ్తికర్ అహ్మద్ (34 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కలిసి ఆజమ్ పాక్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. అయితే జట్టు స్కోరు 106 వద్ద అగర్ బౌలింగ్‌లో బంతిని మిడ్‌వికెట్ దిశగా తరలించిన అజామ్.. సింగిల్ పూర్తి చేసాడు. ఇఫ్తికర్ రెండో పరుగు కోసం అప్పటికే క్రీజు వదిలి కొంచెం దూరం వచ్చేసాడు. దీంతో అజామ్ కూడా రెండో పరుగుకి ప్రయత్నించాడు. డీప్ మిడ్‌వికెట్‌లో బంతిని అందుకున్న వార్నర్.. ఎవరూ ఊహించని రీతిలో డైరెక్ట్‌గా వికెట్లను కొట్టడంతో అజామ్ రనౌటయ్యాడు.

తల బాదుకున్న అజామ్:
కీలక సమయంలో రనౌట్ అవ్వడంతో ఇఫ్తికర్‌పై అసహనం వ్యక్తం చేస్తూ.. అజామ్ తన చేతులతో తలని బాదుకున్నాడు. ఇఫ్తికర్ మాత్రం బంతి దూరంలోనే ఉందిగా అన్నట్టు సైగలు చేసాడు. అనంతరం అజామ్ బ్యాట్ పట్టుకుని నిరాశగా పెవిలియన్ చేరాడు. దీనికి సంబందించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. స్వదేశంలో శ్రీలంకతో సిరీస్ ఓటమి తర్వాత సర్ఫరాజ్ అహ్మద్‌ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన పాక్.. బాబర్ అజామ్‌కి టీ20 పగ్గాలు అప్పగించింది. కెప్టెన్ మారినా పాక్ తలరాత మాత్రం మారలేదు.

పాకిస్తాన్ ఓటమి:
రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఇఫ్తికర్, ఆజమ్ మెరుపులు మెరిపించారు. ఆసీస్ బౌలర్ అగర్ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 18.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసి గెలిచింది. స్మిత్ ఒంటరి పోరాటం చేసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications