Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20WC: డకౌట్ల రారాజుగా మాక్స్‌వెల్.. చెత్త రికార్డు!

ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఐపీఎల్‌లో తన చెత్త ఫామ్‌ను టీ20 వరల్డ్ కప్‌లోనూ కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్-2024లో మాక్సీ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో అయిదు సగటుతో 52 పరుగులే చేశాడు. పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించిన మాక్స్‌వెల్‌ను ఆర్సీబీ అయిష్టంగానే తుదిజట్టులో కొనసాగించింది.

ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పే సామర్థ్యం ఉన్న అతడు కాసేపు క్రీజులో ఉన్నా జట్టుకు ప్రయోజనకరమే అని భావించి బరిలోకి దించింది. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా అంచనాలు అందుకోలేకపోయాడు. అయితే ఆర్సీబీ తరఫున విఫలమవైనా ఆస్ట్రేలియా కోసం మాక్సీ చెలరేగి ఆడుతాడని భావించారంతా. కానీ అతడు మరోసారి అంచనాలను తలకిందులు చేశాడు.

Australia vs Oman Maxwell Joins Elite Group for Most Ducks in Men s T20 Cricket

బార్బడోస్ వేదికగా గురువారం ఒమన్‌తో జరిగిన గ్రూప్-బీ మ్యాచ్‌లో ఖాతా తెరవకముందే పెవిలియన్‌కు చేరాడు. ఒక్క బంతే ఎదుర్కొని గోల్డెన్ డకౌటయ్యాడు. దీంతో కలిపి గత పది ఇన్నింగ్స్‌ల్లో మాక్సీ పది సార్లు డకౌటవ్వడం గమనార్హం. అయితే ఈ క్రమంలో మాక్స్‌వెల్ చెత్త రికార్డు నమోదు చేశాడు. మెన్స్ టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు డకౌటైన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో సునీల్ నరైన్ (44), అలెక్స్ హేల్స్ (43), రషీద్ ఖాన్ (33), గ్లెన్ మాక్స్‌వెల్ (33), పాల్ స్టిర్లింగ్ (32) టాప్-5లో ఉన్నారు.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌటైన చెత్త రికార్డు మాక్స్‌వెల్ పేరిట ఉన్న విషయం తెలిసిందే. లీగ్‌లో మాక్సీ 18 సార్లు డకౌటయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఒమన్‌పై ఆస్ట్రేలియా 39 పరుగుల తేడాతో గెలిచింది. ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటిన మార్కస్ స్టోయినిస్ (67 నాటౌట్; 36 బంతుల్లో, 2 ఫోర్లు, 6 సిక్సర్లు), (3-0-19-3)కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 164 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (56; 51 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్), స్టొయినిస్ అర్ధశతకాలు సాధించారు. మెహ్రన్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో 20 ఓవర్లలో ఒమన్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. అయాన్ ఖాన్ (36; 30 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్.

Story first published: Thursday, June 6, 2024, 17:30 [IST]
Other articles published on Jun 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+