ఇంతటి సునాయాస క్యాచ్‌ను చిన్న పిల్లాడు కూడా వదిలేయడు (వీడియో)!!

సిడ్నీ: సోమవారం న్యూజిలాండ్‌తో ముగిసిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 279 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ టెస్ట్ విజయంలో బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్ (215, 59), బౌలర్ నాథన్ లయన్ (రెండు ఇన్నింగ్స్‌లలో పది వికెట్లు) కీలక పాత్ర పోషించారు. తాజా విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ను ఆసీస్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
ఆస్టిల్ విఫలం
ఈ టెస్టులో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కివీస్ స్పిన్నర్ టాడ్ ఆస్టిల్ చేతిలోకి వచ్చిన సునాయాస క్యాచ్‌ను జారవిడిచాడు. దీంతో ఆ జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది. సోమవారం నాలుగోరోజు ఆటలో భాగంగా ఫామ్ బ్యాట్స్‌మన్ లబుషేన్ క్యాచ్‌ను ఆస్టిల్ జారవిడిచాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 32వ ఓవర్ నాలుగో బంతిని ఆస్టిల్ వేయగా.. లబుషేన్ షాట్ ఆడాడు. బంతి నేరుగా ఆస్టిల్ వైపు వచ్చింది. సునాయాస క్యాచ్‌ను అందుకోవడంలో ఆస్టిల్ విఫలమయ్యాడు. దీంతో లబుషేన్ బతికిపోయాడు.

వార్న్ ఆశ్చర్యం
ఆస్టిల్ క్యాచ్ విడిచే సమయానికి లబుషేన్ 4 పరుగలతో క్రీజులో ఉన్నాడు. క్యాచ్ అనంతరం మరో 55 పరుగులు చేసి ఆసీస్ జట్టుకు భారీ స్కోర్ అందించాడు. సునాయాస క్యాచ్ నేలపాలవ్వడంతో కామెంటరీ బాక్సులో ఉన్న ఆసీస్ మాజీ దిగ్గజం షేన్ వార్న్ ఆశ్చర్యానికి లోనయ్యాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న లబుషేన్ క్యాచ్‌ను జారవిడవడం నమ్మలేకపోతున్నా అని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో పట్టుకోలేకపోయిన సులభమైన క్యాచ్ ఇదే అని అన్నాడు.
చిన్న పిల్లాడు కూడా వదిలేయడు
లబుషేన్-ఆస్టిల్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు కామెంట్లతో ఆస్టిల్‌ను ఆటాడుకుంటున్నారు. 'గల్లీ క్రికెట్‌లో కూడా ఇలాంటి క్యాచ్‌ను వదిలేయరు' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'ఇంతటి సునాయాస క్యాచ్‌ను చిన్న పిల్లాడు కూడా వదిలేయడు' అని మరో నెటిజన్ కామెంట్ చేసాడు. ఈ టెస్టులో నాథన్ లయోన్ రెండు క్యాచ్‌లు జారవిడిచాడు. అయితే ప్యాటిన్సన్ పరుగెత్తుకుంటూ వచ్చి ఓ అద్భుత క్యాచ్ పట్టుకున్నాడు.

3-0తో సిరీస్ క్లీన్‌స్వీప్:
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను ఆసీస్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అంతకుముందు పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను కూడా 2-0తో కైవసం చేసుకుంది. దీంతో ఆసీస్ ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్‌లో 296 పాయింటలతో టీమిండియా (360) తరువాతి స్థానంలో ఉంది. ఐపీఎల్-2020, టీ20 ప్రపంచకప్ ముగిశాక అన్ని జట్లు టెస్టులపై ఫోకస్ పెట్టనున్నాయి. వరుసగా టెస్టు సిరీస్‌లు ఆడుతాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications